Vivo V27 Series : వివో కొత్త సిరీస్ భలే ఉందిగా.. టచ్ చేస్తే కలర్ మారే ఖతర్నాక్ ఫోన్.. డిస్కౌంట్లో వస్తుంటే ఎవరైనా వద్దంటారా..!

Vivo V27 Series : ఫ్లాగ్‌షిప్ కెమెరాలు, రంగులు మార్చే డిజైన్, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌తో Vivo V27 సిరీస్ భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయొచ్చు.

Vivo V27 Series : వివో కొత్త సిరీస్ భలే ఉందిగా.. టచ్ చేస్తే కలర్ మారే ఖతర్నాక్ ఫోన్.. డిస్కౌంట్లో వస్తుంటే ఎవరైనా వద్దంటారా..!

Vivo V27 Series launched in India

Updated On : April 2, 2025 / 11:43 AM IST

Vivo V27 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? వివో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి అద్భుతమైన కొత్త వివో సిరీస్ వచ్చేసింది. వివో ప్రీమియం V27 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. వివో V27 ప్రో, వివో V27 అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ వివో ఫోన్ పట్టుకుంటే చాలు.. డిజైన్ కలర్ రంగురంగులుగా మారిపోతుంది.

రంగులు మారే ఈ కలర్‌ఫుల్ వివో ఫోన్ ప్రస్తుతం డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉంది. ఈ వివో V27 సిరీస్ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ కెమెరాలు, ఆకర్షణీయమైన 3D కర్వ్డ్ డిస్‌ప్లే, వివో సిగ్నేచర్ కలర్-ఛేంజింగ్ ఫ్లోరైట్ AG గ్లాస్‌ను అందిస్తాయి. OISతో కూడిన పవర్‌ఫుల్ 50MP సోనీ IMX766V సెన్సార్, కొత్త ఆరా లైట్ టెక్నాలజీ, స్టైలిష్ అల్ట్రా-స్లిమ్ డిజైన్‌ను కలిగిన V27 సిరీస్ అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Read Also : Money Saving Tips : మీకు జీతం పడగానే ఈ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. రూ.కోటి వరకు ఈజీగా సంపాదించొచ్చు..!

వివో V27 ప్రో, వివో V27 భారత్ ధర ఎంతంటే? :
వివో V27 ప్రో 3 స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతుంది.

  • 8GB + 128GB ధర : రూ. 37,999
  • 8GB + 256GB ధర : రూ. 39,999
  • 12GB + 256GB ధర : రూ. 42,999

ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, రిటైల్ స్టోర్‌లలో ప్రీ-బుకింగ్స్ ఈరోజు ప్రారంభమవుతుంది. HDFC, ICICI, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులపై రూ. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫ్‌లైన్ కొనుగోలుదారులు రూ. 3,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

వివో V27 సేల్ ఆఫర్లు :

  • 8GB + 128GB ధర రూ. 32,999
  • 12GB + 256GB ధర రూ. 36,999.
  • వివో TWS ఎయిర్ కూడా రూ.3,999 ధరకు లాంచ్ అయింది. అయితే వివో V27 సిరీస్ కొనుగోలుదారులు బండిల్ ఆఫర్‌లో భాగంగా రూ.2,999 ధరకు పొందవచ్చు.

3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో డిజైన్ :
వివో V27 సిరీస్ అల్ట్రా-స్లిమ్, ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1.07 బిలియన్ కలర్ ఆప్షన్లతో 6.78-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అద్భుతమైన వ్యూను అందిస్తుంది.

రెండు మోడళ్లలో మ్యాజిక్ బ్లూ వేరియంట్‌లో కలర్ మార్చే ఫ్లోరైట్ AG గ్లాస్ ఉంటుంది. UV కాంతి తగలగానే లైట్ కలర్ నుంచి బ్రైట్ బ్లూ కలర్‌లోకి మారుతుంది. ఆకర్షణీయమైన 7.36mm బాడీ చేతిలో గ్రిప్ ఉండేలా చేస్తుంది. అత్యంత స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.

ఆరా లైట్ టెక్నాలజీతో కూడిన ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ 50MP కెమెరా ఉంది. వివో V27 ప్రో, వివో V27 సోనీతో డెవలప్ చేసిన OIS ఆధారిత అడ్వాన్స్‌డ్ 50MP సోనీ IMX766V సెన్సార్‌తో అమర్చి ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ కెమెరా సెటప్‌లో మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అందులో 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. హై క్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఐ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

ఆరా లైట్ టెక్నాలజీ నైట్ పోర్ట్రెయిట్‌లను అందిస్తుంది. తక్కువ కాంతిలో కూడా స్టూడియో క్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. అదనంగా, ప్రత్యేకమైన వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రెయిట్ మోడ్‌లో భారతీయ వివాహాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రోసెక్కో, నియో-రెట్రో, పాస్టెల్స్ అనే మూడు కస్టమ్ (LUTs) ఉన్నాయి.

వివో V27 మీడియాటెక్ చిప్‌సెట్స్ :
వివో V27 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 (4nm) ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. తక్కువ పవర్ వినియోగంతో ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వివో V27 భారత మొట్టమొదటి మీడియాటెక్ డైమన్షిటీ 7200 5G ప్రాసెసర్‌తో వచ్చింది. సరైన సామర్థ్యంతో హైపర్‌ఇంజిన్ 5.0ని కలిగి ఉంది. రెండు మోడళ్లు LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌తో వస్తాయి. మల్టీ టాస్కింగ్, స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి.

గేమింగ్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ :

  • గేమింగ్ కోసం V27 సిరీస్ ఫీచర్లు
  • గేమ్ బూస్ట్ మోడ్
  • ఆల్-రౌండ్ ఆడియో అప్‌గ్రేడ్

హీట్ మేనేజ్‌మెంట్ కోసం అల్ట్రా లార్జ్ వేపర్ చాంబర్ బయోనిక్ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది. RAM 3.0 ఎక్స్‌పాండ్ ఆప్షన్, పర్ఫార్మెన్స్ కోసం 8GB వరకు వర్చువల్ RAM అందిస్తోంది. ఈ డివైజ్‌లు 66W ఫ్లాష్‌ఛార్జ్‌తో కూడిన 4600mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. వివో డ్యూయల్-ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. ఫాస్ట్ రీఛార్జ్‌లతో ఫుల్ డే బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.

ఆండ్రాయిడ్ 13తో ఫన్‌టచ్ OS 13 :
ఫన్‌టచ్ OS 13 (Android 13)పై రన్ అయ్యే వివో V27 సిరీస్ మెరుగైన ప్రైవసీ సెట్టింగ్‌లు, పర్సనలైజేషన్ ఆప్షన్లు, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Read Also : Realme P3 Pro 5G : భలే డిస్కౌంట్ భయ్యా.. రియల్‌మి లవర్స్ ఈ 5G ఫోన్ అసలు వదులుకోవద్దు.. ఎందుకంటే?

వివో TWS ఎయిర్ : లైట్‌వెయిట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

  • వివో TWS ఎయిర్‌ ఫీచర్లు :
  • 14.2mm స్పీకర్ డ్రైవర్
  • 25 గంటల వరకు బ్యాటరీ లైఫ్
  • గూగుల్ ఫాస్ట్ పెయిర్ & బ్లూటూత్ 5.2
  • డీప్ఎక్స్ 2.0 స్టీరియో సౌండ్ ఎఫెక్ట్స్ (మెగా బాస్, క్లియర్ వాయిస్, హై పిచ్)
  • ‘మేక్ ఇన్ ఇండియా’ కమిట్‌మెంట్

వివో V27 సిరీస్ ఫోన్ TWS ఎయిర్ రెండూ భారత మార్కెట్లోని Vivo గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో తయారయ్యాయి.