2023 Royal Enfield Bullet 350 launch in India on August 30, Check out price, features, specs here
2023 Royal Enfield Bullet 350 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఆగస్టు 30న భారత మార్కెట్లో గ్రాండ్‌గా అరంగేట్రం చేయనుంది. ఈ కొత్త జనరేషన్ మోటార్‌సైకిల్ 350cc ఇంజిన్‌లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కోర్ ప్లాట్‌ఫారమ్‌లో అడుగుపెట్టనుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇంజన్, ప్లాట్‌ఫారమ్ :
2023 బుల్లెట్ 350 19bhp శక్తిని, 28Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 346cc ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇంజిన్ రిఫైండ్, పవర్‌ఫుల్ సేవింగ్ అందిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లలో ఉపయోగించే J-ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.
ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వేరియంట్స్ :
2023 బుల్లెట్ 350 కిక్ స్టార్ట్ (KS), ఎలక్ట్రిక్ స్టార్ట్ (ES) వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కొత్త ఫీచర్లు ఇవేనా? :
2023 బుల్లెట్ 350 సింగిల్-పీస్ సీటు, హాలోజన్ హెడ్‌ల్యాంప్, కొత్త స్విచ్ గేర్‌ను కలిగి ఉంటుంది. కొత్త బుల్లెట్ 350లో ముఖ్యమైన మెరుగుదలలలో ఇంధన గేజ్ ఒకటి. గత మోడళ్లలో లేని ఫీచర్ ఇందులో ఉండనుంది. బైక్ ఫిట్, ఫినిషింగ్ కూడా అద్భుతంగా మెరుగుపడింది. బైక్ ఐకానిక్ డిజైన్ కొనసాగిస్తుంది. ఇంధన ట్యాంక్, ప్యానెల్‌లపై ట్రెడేషనల్ హ్యాండ్ పెయింట్ చేసిన పిన్‌స్ట్రైప్‌లను కలిగి ఉంటుంది.
2023 Royal Enfield Bullet 350 launch in India on August 30, Check out price, features, specs here
రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 మైలేజ్ :
2023 బుల్లెట్ 350 38kmpl మైలేజీని అందిస్తుందని అంచనా.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 స్పెసిఫికేషన్‌లు :
2023 బుల్లెట్ 350 ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక ట్విన్ షాక్‌లను పొందుతుంది. ముందువైపు 280mm డిస్క్, వెనుకవైపు 153mm డ్రమ్ ఉంటుంది. మోటార్‌సైకిల్‌లో సింగిల్-ఛానల్ ABS ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధర ఎంత? :
2023 బుల్లెట్ 350 ధర రూ. 1.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.