×
Ad

New Electric SUVs : ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్.. ఈ కొత్త 4 ఎలక్ట్రిక్ SUV కార్లు మార్కెట్ షేక్ చేయబోతున్నాయి..!

New Electric SUV : భారత మార్కెట్లోకి అతి త్వరలో 500కి.మీ రేంజ్‌తో 4 ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నాయి. ఇందులో మీకు ఏది కావాలో ఎంచుకోండి.

New Electric SUV

New Electric SUV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు రాబోతున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే నెలల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో భారీ మార్పులను చూడనుంది.

ఈసారి పోటీలో 4 పెద్ద బ్రాండ్లు టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రా, టయోటా (New Electric SUVs) మధ్య జరగనుంది. ఈ కంపెనీలన్నీ కొత్త 500 కి.మీ. ఎలక్ట్రిక్ SUVలతో మార్కెట్‌లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నయి. మీరు కూడా పవర్‌ఫుల్ స్టైలిష్, ఎకో ఫ్ఱెండ్లీ SUV కోసం చూస్తున్నారా? అయితే, త్వరలోనే భారత మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

టాటా సియెర్రా ఎలక్ట్రిక్ :
దేశంలో అత్యంత డిమాండ్ కలిగిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో టాటా సియెర్రా ఎలక్ట్రిక్ ఒకటిగా మారనుంది. టాటా ఐకానిక్ మోడల్ సియెర్రాను మరోసారి కొత్త అవతార్‌లో లాంచ్ చేయబోతోంది. కంపెనీ మొదట ICE (పెట్రోల్/డీజిల్) వెర్షన్‌ ప్రవేశపెట్టనుంది. ఆ తరువాత సియెర్రా ఈవీ 2026 ప్రారంభంలోనే లాంచ్ కానుంది.

ఈ ఎస్‌యూవీ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని భావిస్తున్నారు. దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, టెర్రైన్ డ్రైవ్ మోడ్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ రూఫ్, లెవల్ 2 అడాస్ వంటి ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. టాటా సియెర్రా ఈవీ కర్వ్ ఈవీ కన్నా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

Read Also : Samsung Galaxy A56 5G Review : ఈ శాంసంగ్ ఫోన్ చూస్తే ఇతర బ్రాండ్లు షేక్ అవ్వాల్సిందే.. శాంసంగ్ గెలాక్సీ A56 5G మాస్ రివ్యూ..!

మహీంద్రా XEV 9S :
మహీంద్రా ఇప్పుడు ఈవీ సెగ్మెంట్లో భారీ మార్పులు చేయబోతోంది. కంపెనీ కొత్త ఎస్‌యూవీ మహీంద్రా XEV 9S లాంచ్ చేయనుంది. వాస్తవానికి XUV700 అనేది ఎలక్ట్రిక్ వెర్షన్. 27 నవంబర్ 2025న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఎస్‌యూవీ మహీంద్రా కొత్త INGLO మాడ్యులర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది.

దీనికి రెండు బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. టాప్ వేరియంట్ రేంజ్ 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే డిజైన్, ఫీచర్ల పరంగా అత్యంత ప్రీమియంగా ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్, స్మార్ట్ ఇంటీరియర్ వంటి అనేక ఆప్షన్లను కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి ఇ-విటారా :

భారత మార్కెట్లో అతిపెద్ద ఆటో కంపెనీ మారుతి సుజుకి.. కంపెనీ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ ఎస్‌యూవీ గుజరాత్ ప్లాంటులో ఉత్పత్తి చేసే నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయానికి రానుంది. మారుతి ఇ-విటారా 49kWh, 61kWh రెండు బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. ఈ కారు 500 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో లార్జ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, అడాస్ టెక్నాలజీ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ BEV :
టయోటా కంపెనీ త్వరలో అర్బన్ క్రూయిజర్ BEV కారు లాంచ్ చేయనుంది. మారుతి e-విటారా ఆధారంగా వస్తుంది. ఈ SUV సుజుకీ హార్టెక్ట్ ఇ-ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతుంది. ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లతో పాటు ఫుల్ డిజిటల్ కాక్‌పిట్‌ను కలిగి ఉంటుంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. డ్యూయల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, OTA అప్‌డేట్స్, అడాస్ సూట్ వంటి హై-ఎండ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అర్బన్ క్రూయిజర్ బీఈవీ 2026 ప్రారంభంలో లాంచ్ కానుంది. కంపెనీ గ్లోబల్ మోడల్స్ నుంచి సరికొత్త డిజైన్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.