Best Air Conditioners : కొత్త ఏసీ కొంటున్నారా? రూ. 50 వేలలోపు ధరలో 5 బెస్ట్ ACలు మీకోసం.. ఇక ఇల్లంతా కూల్..!

Best Air Conditioners : కొత్త ఏసీ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ప్రస్తుతం మార్కెట్లో రూ. 50వేల లోపు ధరలో 5 అద్భుతమైన బెస్ట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Best Air Conditioners

  • కొత్త ఏసీ కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు
  • రూ. 50వేల లోపు ధరలో 5 బెస్ట్ ఏసీలు మీకోసం
  • మీ ఫేవరెట్ ఏసీ ఏది కావాలో ఇంటికి తెచ్చుకోండి

Best Air Conditioners : అయ్య బాబోయ్.. ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో కూడా కాసేపు ఫ్యాన్, ఏసీ, కూలర్లు లేకుండా ఉండలేని పరిస్థితి.. ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సమ్మర్ సీజన్ లో ఎండ వేడిని తట్టుకోవాలంటే కొత్త ఏసీ కొనాల్సిందే..

అది కూడా మీ బడ్జెట్ ధరలోనే.. 2026 సమ్మర్‌లో ఎయిర్ కండీషనర్‌ కొనాలని అనుకుంటే ఇది మీకోసమే.. ఈ సమ్మర్‌లో రూ. 50వేల లోపు ధరలో టాప్ 5 ఎయిర్ కండీషనర్లు అందుబాటులో ఉన్నాయి.. ఇందులో మీకు నచ్చిన ఏసీని ఇంటికి తెచ్చుకోండి.

పానసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ (రూ. 44,990) :
1.5 టన్ కెపాసిటితో 17,402 బీటీయూ కూలింగ్ పవర్‌ అందిస్తుంది. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో ఏడాదికి 681.01kWh పవర్ ఆదా చేస్తుంది.

Read Also : Smartphones Prices : మీ ఫేవరెట్ ఫోన్ ధర పెరిగిందా? భారత్‌లో 80 మోడళ్లపై భారీ పెంపు.. ఇంకా పెరగనున్న ధరలు!

ఎల్‌జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (రూ. 42,990) :
1.5 టన్ కెపాసిటితో 5KW కూలింగ్ పవర్‌ను అందిస్తుంది. 4-వే స్వింగ్, ఆటో క్లీన్, ఫాస్ట్ కూలింగ్, ఇన్వర్టర్ కంప్రెసర్, రిమోట్ కంట్రోల్ ఉంటాయి

హేయర్ గ్రావిటీ సిరీస్ (రూ. 41,970) :
1.6 టన్ కెపాసిటితో 5.46KW కూలింగ్ పవర్‌ అందిస్తుంది. 7-ఇన్-1 కూలింగ్ మోడ్‌తో 40 శాతం నుంచి 110శాతం వరకు కూలింగ్ కెపాసిటీ కంట్రోలింగ్ అందిస్తుంది.

క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ (రూ. 41,990):
1.5టన్ కెపాసిటితో 4.8KW కూలింగ్ పవర్‌ అందిస్తుంది. 6-ఇన్-1 ఫ్లెక్సీకూల్ కన్వర్టిబుల్ టెక్నాలజీ తో సుమారు 50శాతం వరకు పవర్ ఆదా అవుతుంది.

డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (రూ. 42,490):
1.5 టన్ కెపాసిటితో 5.28kw కూలింగ్ పవర్‌ను అందిస్తుంది. 3D ఎయిర్ ఫ్లో, అపటైట్ ఫిల్టర్, DNNS సెల్ఫ్-హీల్ కోటింగ్, డ్యూ క్లీన్ టెక్నాలజీ, హెప్తా సెన్స్ ఉంటాయి.