8th Pay Commission
8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం అమలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేతన సంఘం అమలైతే ఉద్యోగుల జీతాలతో పాటు పెన్షనర్ల పెన్షన్లు కూడా భారీగా పెరుగుతాయి. కానీ, ఇప్పటివరకూ ఈ వేతన సంఘం అమలుపై ఎలాంటి క్లారిటీ లేదు. ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే ప్రశ్న ఏమిటంటే.. 8పే కమిషన్ ఎప్పుడు అమలు అవుతుంది? వేతనాలు ఎప్పుడు పెరుగుతాయి?
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో 8వ వేతన సంఘం కోసం నిబంధనలను (ToR) ఆమోదించింది. ఇప్పటికే ఒక చైర్‌పర్సన్, సిఫార్సులను సిద్ధం చేస్తున్న ప్యానెల్‌లో కొంతమంది సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి రిపోర్టును కూడా సమర్పించేందుకు ప్యానెల్‌కు 18 నెలల సమయం ఉంది. అయితే, తుది అమలు తేదీని ఇంకా ప్రకటించలేదు.
కేంద్ర ప్రభుత్వం అమలు తేదీని ఇంకా నిర్ణయించలేదు. గత సిఫార్సులను పరిశీలిస్తే.. 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగిసింది. ఆ తర్వాత సవరించిన నిబంధనలు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. నవంబర్ 2, 2025 తీర్మానం ప్రకారం.. 8వ వేతన సంఘం 18 నెలల్లోపు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టును సమర్పిస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో పేర్కొన్నారు.
ఉద్యోగుల జీతాలు ఎప్పుటినుంచి పెరుగుతాయి? :
నివేదిక సమర్పించిన తర్వాత కూడా 8వ వేతన సంఘం అమలుకు సమయం పడుతుంది. అయితే, సిఫార్సుల ఆమోదం తర్వాత జీతాల పెంపుపై ఒక క్లారిటీ రానుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి లెక్కించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
GenZCFO వ్యవస్థాపకుడు సీఏ మనీష్ మిశ్రా ప్రకారం.. “7వ వేతన సంఘం సిఫార్సులు ఆమోదించిన తర్వాత చెల్లింపు జరిగినప్పటికీ బకాయిలు జనవరి 1, 2026 నుంచి లెక్కించనున్నారు. ఆ తేదీని 7వ వేతన సంఘం గడువుగా నిర్ణయించారు.”
ఉద్యోగుల జీతాల పెంపును ఎంత ఉండొచ్చు? :
నివేదిలక ప్రకారం.. “6వ వేతన సంఘం దాదాపు 40శాతం సగటు పెంపును అందించింది. అయితే, 7వ వేతన సంఘం జీతం, భత్యాలపై మొత్తం ప్రభావం తరచుగా 23 శాతం నుంచి 25శాతం వరకు ఉంటుంది. సింగిల్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది.
8వ వేతనం సంఘంలో గత అంచనాలు జీతంలో 20 శాతం నుంచి 35 శాతం పెరుగుదలను సూచిస్తున్నాయని భావిస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.4 నుంచి 3.0 మధ్య ఉంటుందని, ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమేనని గమనించాలి.