Maruti Brezza Facelift : ఫ్యామిలీ SUV కారు వచ్చేస్తోంది.. కొత్త లుక్‌తో మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ అదిరింది.. మార్కెట్ షేక్ అవ్వాల్సిందే..!
Maruti Brezza Facelift : మారుతి సుజుకి హిట్ SUV బ్రెజ్జా సరికొత్త వెర్షన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. జూన్ 2022లో వచ్చిన బ్రెజ్జా మోడల్ దాదాపు 4 ఏళ్లుగా మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కొత్త బ్రెజ్జా ఫేస్ లిఫ్ట్ ఏయే ఫీచర్లతో రాబోతుందో వివరంగా తెలుసుకుందాం..
Maruti Brezza Facelift
- భారత మార్కెట్లో త్వరలో కొత్త మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్
- జూన్ 2022లో వచ్చిన మారుతి బ్రెజ్జా 4 ఏళ్లుగా మార్కెట్లో ఉంది
- టెయిల్ ల్యాంప్ గ్రాఫిక్స్, కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండొచ్చు
Maruti Brezza Facelift : మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మారుతి లవర్స్ మీకోసమే.. అతి త్వరలో మారుతి బ్రెజ్జా భారత మార్కెట్లో వచ్చేస్తోంది. మారుతి ఈ సూపర్ హిట్ SUVని పూర్తిగా కొత్త అవతారంలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జూన్ 2022లో లాంచ్ అయిన ప్రస్తుత బ్రెజ్జా దాదాపు 4 ఏళ్లుగా మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ ఈ కారుకు మెయిన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ద్వారా కొత్త అప్డేట్ అందించాలని యోచిస్తోంది.
హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ వంటి కార్లు కొత్త ఫీచర్లతో మార్కెట్లో గట్టిపోటీని ఇస్తున్నాయి. మారుతి కూడా అదే రేంజ్ ఫీచర్లతో కొత్త అవతార్ మార్కెట్లోకి దించేందుకు రెడీ అవుతోంది. రాబోయే కొత్త బ్రెజ్జా అనేకసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం.. రాబోయే కొన్ని నెలల్లో మీరు కొత్త బ్రెజ్జాను రోడ్లపై చూడవచ్చు.
అద్భుతమైన డిజైన్ స్టయిలీ లుక్ :
ఎక్స్‌ట్రనల్ ఫీచర్ల విషయానికి వస్తే.. కొత్త బ్రెజ్జా గతంలో కన్నా స్పోర్టియర్‌గా అత్యంత మోడ్రాన్ ఫీచర్లతో కనిపిస్తుంది. రీడిజైన్ ద్వారా బంపర్లు, ఆకర్షణీయమైన కొత్త హెడ్లైట్లు, టెయిల్ ల్యాంప్‌లు, అద్భుతమైన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇంకా, కంపెనీ కొన్ని కొత్త కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టవచ్చు. పాత మోడల్ కన్నా చాలా భిన్నంగా లేటెస్టుగా ఉంటుంది.
క్యాబిన్లో కూడా భారీ మార్పులు ( అంచనా) :
మరోవైపు, ఈ మారుతి బ్రెజ్జాలో SUV క్యాబిన్ కూడా కొత్తగా ఉండనుంది. డాష్‌బోర్డ్‌ను రీడిజైన్ చేస్తోంది. ఇందులో భారీ 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. నీడిల్-మౌంటెడ్ మీటర్ ఇప్పుడు వాహన సమాచారాన్ని అందిస్తుంది. ఫుల్ డిజిటల్ డిస్ ప్లేతో వస్తుంది.
వేసవిలో వెంటిలేటెడ్ సీట్లు, రాత్రిపూట మరింత విలాసవంతమైన రైడ్ కోసం యాంబియంట్ లైటింగ్ కూడా ఉంటాయి. కొత్త బ్రెజ్జాలో అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) కూడా ఉంటుందని భావిస్తున్నారు.
పవర్‌ట్రెయిన్‌లో ఇంజిన్ మార్పులు :
మారుతి ఇంజిన్ పరంగా కూడా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ప్రస్తుత బ్రెజ్జా 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్-CNG ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. రాబోయే బ్రెజ్జా కొత్త టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందించే అవకాశం ఉంది. కొత్త టర్బోచార్జ్డ్ ఇంజిన్ 1.2-లీటర్ యూనిట్ ఉండొచ్చు. మారుతి సుజుకి ఇప్పటికే పోర్ట్‌ఫోలియోలో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తుంది. ప్రస్తుతం ఫ్రాంక్స్‌లో ఇదే ఇంజిన్ ఉంది.
పవర్ ఫుల్ పికప్ అవసరమయ్యే వారికి ఈ ఇంజిన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. దూర ప్రయాణాలకు బెస్ట్ కారు అని చెప్పొచ్చు. అయితే, ప్రారంభ లాంచ్ గురించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
