8th Pay Commission
8th Pay Commission : 2025 ప్రారంభంలో మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ శుభవార్త అందించింది. జనవరి 16, 2025న 8వ వేతన సంఘాన్ని ప్రకటించింది. అయితే, సెప్టెంబర్ ముగిసే సమయానికి కమిషన్ అధికారిక నోటిఫికేషన్, నిబంధనలు (ToR), సభ్యుల నియామకం ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఆలస్యమే ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళనలకు కారణమైంది. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. 8వ వేతన సంఘం అమలు కోసం 2028 వరకు వేచి ఉండాల్సి వస్తుందా? దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
2028లో వేతన సంఘం ఉంటుందా? :
ఈ ప్రశ్నకు సమాధానం లేదు. గత పద్ధతుల ప్రకారం (8th Pay Commission) వేతన సంఘం ఏర్పాటు నుంచి అమలుకు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు పడుతుంది. ఈసారి కూడా అదే పద్ధతి పునరావృతమైతే.. 2028 వరకు వేచి ఉండటం తప్పనిసరి. 8వ వేతన సంఘం సిఫార్సుల అమలుకు ఎంత సమయం పట్టవచ్చో తెలుసుకునేందుకు మునుపటి రెండు వేతన సంఘపు కాలక్రమాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
6వ వేతన సంఘానికి 24 నెలలు :
6వ వేతన సంఘాన్ని 2006 అక్టోబర్‌లో ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ తన రిపోర్టును మార్చి 2008లో ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2008లో ఈ రిపోర్టును ఆమోదించింది. జనవరి 1, 2006 నుంచి ప్యానెల్ సిఫార్సులను అమలు చేసింది. 6వ వేతన సంఘం ఏర్పాటు నుంచి అమలుకు దాదాపు 22 నెలల నుంచి 24 నెలలు పట్టింది.
7వ వేతన సంఘం కాలక్రమం :
రాబోయే నెలల్లో కమిషన్ ఏర్పడి రిపోర్టు రెడీ చేసేందుకు రెండు ఏళ్లు పడితే.. అది 2027 నాటికి సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత, కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టును పరిశీలించడంతో పాటు ఎడిట్ చేయడం, ఆమోదించేందుకు కూడా టైమ్ పడుతుంది. అందుకే, 2028 నాటికి అమలు చేసే అవకాశం ఉంది. కమిషన్ సిఫార్సులు జనవరి 2026 నుంచి అమలు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆలస్యమైన కాలంలోని బకాయిలను అందిస్తాయి.
ఈ కమిషన్ ఎందుకు ముఖ్యమంటే? :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు మాత్రమే కాదు.. వారి భత్యాలు, పెన్షన్లు, భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు కమిషన్ త్వరలోనే అమలు చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. కమిషన్ సిఫార్సులు పెన్షనర్లకు కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వారి పెన్షన్లు, డియరెన్స్ అలవెన్స్ (DA)పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు? :
7వ కమిషన్ విధానం రిపీట్ అయితే 8వ కమిషన్ రిపోర్టు, తదుపరి ఆమోదం కోసం సమయం పడుతుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత జాప్యాలను బట్టి పరిశీలిస్తే 2028 వరకు పొడిగించే అవకాశం ఉంది.
అంచనాలివే :
1.2 కోట్లకు పైగా ఉద్యోగులు, పెన్షనర్లు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, కీలక ప్యానెల్ సభ్యుల నియామకం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6వ, 7వ కమిషన్లు అమలుకు చాలా సమయం పట్టిందని చరిత్ర చెబుతోంది.అందుకే 8వ వేతన కమిషన్ 2028 వరకు అమలు అయ్యే అవకాశం లేదు.