8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్‌డేట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్రఉద్యోగులు కొత్త వేతన సంఘం అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఫిబ్రవరిలో జరిగిన జాతీయ మండలి జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) సమావేశంలో 8వ వేతన సంఘం జీత సవరణకు సంబంధించి పెద్దఎత్తున డిమాండ్ లేవనెత్తారు.
ఫ్యామిలీలోని సభ్యుల సంఖ్యను 3 నుంచి 5కి పెంచాలని అంటున్నారు. ప్రతి ఫ్యామిలీ యూనిట్‌లో సభ్యుల సంఖ్యను పెంచడం వల్ల 8వ సీపీసీకి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వంలోని కీలక ఉద్యోగులు, పెన్షనర్ సంస్థలు భావిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాల డిమాండ్‌ను అంగీకరిస్తే 8వ సీపీసీకి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3 కన్నా ఎక్కువగా ఉండవచ్చనని అంచనా.
1957 నుంచి ఎలాంటి మార్పు లేదు :
1957లో 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ILC)లో 3 ఫ్యామిలీ యూనిట్ల పరిమితిని ప్రవేశపెట్టారు. అయితే, అవసరాన్ని బట్టి వేతనాలను నిర్ణయించే నియమాలు చర్చకు వచ్చాయి. అప్పటి నుంచి వేతన కమిషన్ కనీస వేతనాన్ని లెక్కిస్తే 3 ఫ్యామిలీ యూనిట్లను (భర్త, భార్య, ఇద్దరు పిల్లలు) పరిగణించింది.
8వ వేతన కమిషన్‌లో ఫ్యామిలీ యూనిట్ల సంఖ్యను 3 నుంచి ఐదుకు పెంచాలని కార్మిక సంఘాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకోవాల్సిన చట్టపరమైన బాధ్యత పిల్లలకు ఉందని కార్మిక సంఘాలు విశ్వసిస్తున్నాయి. అందుకే మరో రెండు ఫ్యామిలీ యూనిట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
జీతంపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? :
ఫ్యామిలీ యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5కి పెంచితే 8వ వేతన సంఘం జీతం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5కి పెంచడం వల్ల బేసిక్ పే అనేది 66శాతం (3 యూనిట్లు/5 యూనిట్లు) పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
అంటే.. అదనపు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 0.66 (66శాతం) పెంపు అనేది ఫ్యామిలీ యూనిట్‌కు 33.33శాతం పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు ఫ్యామిలీ యూనిట్లు 66.67శాతానికి సమానం. అంటే మొత్తంగా 66శాతం రౌండ్ ఫిగర్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం 5 ఫ్యామిలీ యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటే 8వ కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.0ని మించుతుందా లేదా అనేది చూడాలి.
జీతం ఎంత పెరగొచ్చు? :
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3గా భావిస్తే.. భారీ మొత్తంలో ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కొత్త పెంపును లెక్కించే ఫార్ములా చాలా ఈజీగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక జీతాన్ని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించాల్సి ఉంటుంది.
కనీస వేతనం X ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ = కొత్త పెంపు
ఉదాహరణకు.. ప్రాథమిక జీతం రూ. 17,990 అయితే సీపీసీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3 సెట్ చేస్తే.. కొత్త పెంపు ఇలా ఉంటుంది.
రూ. 3 X రూ. 17,990 = రూ. 53,970.
ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం ప్రకారం బేసిక్ పే వేతనం రూ. 18,000
8వ వేతన సంఘం ఇవి ఆమోదిస్తే వేతనం ఎంత పెరగొచ్చు? :