Aadhaar Card _ How to add or update phone number in Aadhaar card
Aadhaar Card : భారతదేశ పౌరులకు ఆధార్ (Aadhaar Card) చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ నంబర్‌ను 10 అంకెల మొబైల్ నంబర్‌తో లింక్ చేయడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే ఈ ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధానం ప్రక్రియ చాలా సులభం కూడా. మీరు ఇంకా మీ మొబైల్ నంబర్‌తో మీ ఆధార్‌ని లింక్ చేయలేదా? అయితే ఇప్పుడే లింక్ చేసుకోండి.
ఇంతకీ మీరు మీ ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోవచ్చు. ముందుగా మీరు చేయాల్సిందిల్లా.. మీరు కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నారా? ఆధార్‌తో లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్‌తో ఆధార్‌ను లింక్ చేసేందుకు మీ కొత్త మొబైల్ నంబర్‌కి అప్‌డేట్ చేయాలనుకుంటే ఈ కింది విధంగా ఫాలో కావొచ్చు.
Aadhaar Card _ How to add or update phone number in Aadhaar card
ఆధార్ కార్డు – మొబైల్ నెంబర్ లింక్ విధానం :
– ఆధార్ కార్డ్‌లో మీ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలి.
– ఆన్‌లైన్‌లో చేయలేమని గుర్తించండి. మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.
– మీ సమీపంలోని పర్మినెంట్ నమోదు కేంద్రాన్ని విజిట్ చేయవచ్చు.
– ఆధార్ అప్‌డేట్/కరెక్షన్ ఫారమ్‌ను నింపండి.
– మీ ఫారమ్‌ను మళ్లీ చెక్ చేసి, ఆధార్ ఎగ్జిక్యూటివ్‌కు సమర్పించండి.
– సర్వీసు కోసం మీకు కనీస రుసుము రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.
– ఆధార్ ఎగ్జిక్యూటివ్ అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)తో కూడిన రసీదు స్లిప్‌ను మీకు అందజేస్తారు.
– మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి మీరు ఇచ్చిన URNని ఉపయోగించవచ్చు.
– మొబైల్ నంబర్ 90 రోజులలోపు UIDAI డేటాబేస్‌లో అప్‌డేట్ అవుతుంది.
– ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను ఎలా నమోదు చేయాలంటే..
– మీ సమీపంలోని పర్మినెంట్ నమోదు కేంద్రాన్ని విజిట్ చేయాల్సి ఉంటుంది.
– ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది.
– ఫారమ్‌లో మీరు ఆధార్‌తో లింక్ చేసే మొబైల్ నంబర్‌ను యాడ్ చేయండి.
– ఫారమ్‌ను ఆధార్ ఎగ్జిక్యూటివ్‌కు సమర్పించండి.
– ఎగ్జిక్యూటివ్ మీ వివరాలను బయోమెట్రిక్‌లకు యాడ్ చేయడం ద్వారా నిర్ధారిస్తారు.
– ఈ సేవను పొందాలంటే కేవలం రూ. 50 రుసుము చెల్లిస్తే సరిపోతుంది.
మీ మొబైల్ నంబర్‌తో ఆధార్‌ను లింక్ చేసిన తర్వాత.. మీరు mAadhaar App సహా అన్ని ఆన్‌లైన్ ఆధార్ సౌకర్యాలు, PAN కార్డ్ అప్లికేషన్ (కొత్త/పాత కార్డు అప్‌డేట్), DigiLocker, మొబైల్ రీ-వెరిఫికేషన్‌తో సహా UIDAI రూపొందించిన ఆన్‌లైన్ సర్వీసులను పొందవచ్చు. అంతేకాదు.. మ్యూచువల్ ఫండ్ ఆధార్, ఉమంగ్ (UMANG) యాప్, ఆన్‌లైన్ EPF క్లెయిమ్ వంటి విత్‌డ్రా లింక్ కూడా చేసుకోవచ్చు.
Read Also : Linking Aadhaar-Voter ID: ఓటర్ ఐడీతో ఆధార్ లింక్.. సుప్రీంకోర్టులో రేపు విచారణ