Linking Aadhaar-Voter ID: ఓటర్ ఐడీతో ఆధార్ లింక్.. సుప్రీంకోర్టులో రేపు విచారణ

ఆధార్ కార్డు-ఓటర్ ఐడీ లింక్ చేయాలని గత శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం బిల్లు తెచ్చింది. ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది.

Linking Aadhaar-Voter ID: ఓటర్ ఐడీతో ఆధార్ లింక్.. సుప్రీంకోర్టులో రేపు విచారణ

Linking Aadhaar Voter Id

Linking Aadhaar-Voter ID: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, పౌరుల వ్యక్తిగత భద్రత, సమానాత్వానికి భంగం కలిగిస్తుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Son Murdered By Father: కొడుకును చంపి ముక్కలుగా నరికిన తండ్రి.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే

‘‘ఆధార్ కార్డు- ఓటర్ ఐడీ లింక్ చేయడం వల్ల దేశ పౌరులు కాని వారు కూడా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారు. సరైన చర్చ లేకుండానే 24 గంటల్లో కేంద్రం బిల్లును ఆమోదించింది’’ అని సూర్జేవాలా తన పిటిషన్‌లో వివరించారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కూడా చేపట్టింది. కాంగ్రెస్ పార్టీతోపాటు డీఎమ్‌కే, టీఎమ్‌సీ, ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఆధార్ నివాస ధృవీకరణ కోసమే కానీ, పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు కాదని టీఎమ్‌సీ వ్యాఖ్యానించింది. ఆధార్ కార్డు-ఓటర్ ఐడీ లింక్ చేయాలని గత శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం బిల్లు తెచ్చింది. ఎటువంటి చర్చ లేకుండానే 24 గంటల్లో ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందింది.

Syed Hafeez: ‘ఫోర్బ్స్ ఇండియా’ జాబితాలో తెలంగాణ వాసికి చోటు

దీని ప్రకారం… ఎన్నికల సంఘం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే కొత్తగా ఓటర్‌గా నమోదు చేసుకుంటున్న వాళ్లు తమ ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాలని సూచించింది. అయితే, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే, ఆధార్-ఓటర్ ఐడీ లింక్ కచ్చితమేమీ కాదని.. ఎవరైనా స్వచ్ఛందంగా, ఇష్టమైతేనే ఇవ్వొచ్చని కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.