మరో షాక్.. పెరగనున్న ఏసీ, రిఫ్రిజరేటర్ ధరలు.. 8శాతం పెంపు

ఇప్పటికే పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ బండ ధర గుదిబండగా మారింది. నిత్యావసర సరుకుల రేట్లు చుక్కలను తాకుతున్నాయి. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. టీవీ ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా అన్నింటి ధరలు పెరుగుతుడంటంతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. బతుకు భారంగా మారింది. ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు కూడా పెరగనున్నాయి.

AC, refrigerators prices to hike: ఇప్పటికే పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ బండ ధర గుదిబండగా మారింది. నిత్యావసర సరుకుల రేట్లు చుక్కలను తాకుతున్నాయి. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. టీవీ ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా అన్నింటి ధరలు పెరుగుతుడంటంతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. బతుకు భారంగా మారింది. ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు కూడా పెరగనున్నాయి.

అప్పుడే ఎండలు మండిపోతున్నాయ్. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేడి విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఈ వేసవి కాలంలో అత్యధికంగా వినియోగించేవి ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లు అన్న సంగతి తెలిసిందే. వాటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి కంపెనీలు రెడీ అయ్యాయి. ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

తయారీ వ్యయాలు పెరగడంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచగా, మరికొన్ని 3-8 శాతం వరకు పెంచాలని భావిస్తున్నాయి. ఇప్పుడే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటం, ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచి పని కొనసాగుతుండటం వల్ల ఈ ఏడాది ఏసీల అమ్మకాల్లో అధిక రెండంకెల వృద్ధి నమోదు కావొచ్చని వోల్టాస్‌, దైకిన్‌, ఎల్‌జీ, బ్లూస్టార్‌, శామ్‌సంగ్‌, పానసోనిక్‌, హయర్‌ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఏసీల తయారీకి వినియోగించే లోహాలు, కంప్రెషర్లు ధరలు పెరగడంతో ఈ నెలలో ఏసీల ధరలు 3-5 శాతం పెరిగే అవకాశం ఉందని దైకిన్‌ ఎయిర్‌కండిషనింగ్‌ ఇండియా ఎండీ, సీఈఓ కన్వాల్‌ జీత్‌ తెలిపారు. మార్కెట్‌ ధోరణిని పరిశీలించి ఏసీల ధరలు 6-8 శాతం, రిఫ్రిజరేటర్‌ ధరలు 3-4 శాతం పెంచాలని భావిస్తున్నట్లు పానసోనిక్‌ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు మనీశ్‌ శర్మ వెల్లడించారు. ఏసీల ధరలు ఇప్పటికే పెంచామని, ఈ వేసవిలో గిరాకీ పుంజుకుంటుందని వోల్టాస్‌ ఎండీ, సీఈఓ ప్రదీప్‌ భక్షి తెలిపారు.

ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు పెరగనున్నాయన్న వార్తలు జనాలకు షాకిచ్చాయి. వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. ఇప్పటికే ధరాఘాతంతో సతమతం అవుతున్నామని, ఇప్పుడు వీటి ధరలు కూడా పెరిగితే ఎలా అని బిక్కమొఖాలు వేశారు.

ట్రెండింగ్ వార్తలు