Reebok : రీబాక్ ను అమ్మకానికి పెట్టిన ఆడిడాస్‌..

ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ ఉత్పత్తుల సంస్థ రీబాక్ అమ్మకానికి వచ్చింది. నష్టాల్లో ఉండటంతో దీనిని అమ్మెందుకు యాజమాన్యం సిద్ధమైంది. కాగా రీబాక్ ను 2006లో ఆడిడాస్ కొనుగోలు చేసింది. అయితే ఆడిడాస్‌ చేతిలోకి వెళ్లిన తర్వాత రీబాక్‌ వ్యాపారం బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే రీబాక్ ను అమ్మెందుకు సిద్ధమైంది ఆడిడాస్

Reebok

Reebok : ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ ఉత్పత్తుల సంస్థ రీబాక్ అమ్మకానికి వచ్చింది. బ్రిటన్ లో J.W. Foster and Sons అనే స్పోర్ట్స్ ఉత్పత్తిల తయారీ కంపెనీని 1895లో ఏర్పాటు చేయగా దానికి అనుబందంగా వచ్చిందే రీబాక్. 1958లో ఏర్పాటైన రీబాక్ కంపెనీ క్రీడాకారులకు షూ తయారు చేసేది. ఆ తర్వాత కొంతకాలానికి రెగ్యులర్ ఫుట్ వేర్, స్పోర్ట్స్ దుస్తులను కూడా మార్కెట్లోకి తెచ్చింది.

ఇక క్రీడాకారులు ధరించే వస్త్రాలను కూడా ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. 60 ఏళ్లకు పైగా చరిత్రకలిగిన ఈ కంపెనీ యాజమాన్యం త్వరలో మారనుంది. ఈ బ్రాండ్‌ని 2.5 బిలియన్‌ డాలర్లకు అథెంటిక్‌ బ్రాండ్స్‌ గ్రూప్‌ (ఏబీజీ) సొంతం చేసుకోనుంది.

రీబాక్‌ బ్రాండ్‌ని మరో ప్రముఖ స్పోర్ట్స్‌ వేర్‌ సంస్థ అడిడాస్‌ 2006లో 3.8 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది. నైక్‌కి పోటీగా రీబాక్‌ను తీర్చిదిద్దేంకు ప్రయత్నించింది.

కానీ పరిస్థితిలు అనుకూలించకపోవడంతో ఆడిడాస్ చేతిలోకి వెళ్లిన తర్వాత రీబాక్‌ వ్యాపారం బాగా దెబ్బతింది. దీంతో ఆడిడాస్‌లోని ఇన్వెస్టర్లు రీబాక్‌ను అమ్మాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో రీబాక్‌ బ్రాండ్‌ను వదిలించుకునేందుకు అడిడాస్‌ సిద్ధమైంది.