Trai Data : యూజర్ల దెబ్బకు జియో, వోడాఫోన్ ఐడియా డీలా.. ఎయిర్‌టెల్ ఫుల్ జోష్..!

Trai Data : దేశీయ టెలికం దిగ్గజాల మధ్య తీవ్ర పోటి నెలకొంది. రిలయన్స్ జియోతో పాటు ఇతర పోటీదారులైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ఒకదానికొకటి పోటీపడుతున్నాయి.

Trai Data : దేశీయ టెలికం దిగ్గజాల మధ్య తీవ్ర పోటి నెలకొంది. రిలయన్స్ జియోతో పాటు ఇతర పోటీదారులైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఒకప్పుడు డేటా సంచలనంతో యూజర్లను ఆకట్టుకున్న జియో యూజర్లను కోల్పోతోంది. వరుసగా మూడోసారి భారీగా జియో యూజర్లను కోల్పోయింది కంపెనీ. జియోతో పాటు వోడాఫోన్ ఐడియా కూడా భారీగా కస్టమర్లను కోల్పోయింది. భారతీ ఎయిర్ టెల్ మాత్రం కొత్త కస్టమర్లు వచ్చి చేరడంతో ఫుల్ జోస్ మీద కనిపిస్తోంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటా ప్రకారం.. దేశీయ టెలికం కస్టమర్ల సంఖ్య 2022 ఫిబ్రవరిలో 116.6 కోట్లుగా నమోదైంది.

జనవరితో కస్టమర్ల సంఖ్యను పోలిస్తే.. యూజర్ బేస్ సంఖ్య 0.29 శాతం తగ్గిందని ట్రాయ్ డేటా సూచిస్తోంది. రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా కస్టమర్ల సంఖ్య.. దేశంలోని పలు రాష్ట్రాలైన హర్యానా, జమ్ము కశ్మీర్, తూర్పు యూపీ మినహా ఇతర రాష్ట్రాల్లో మొబైల కస్టమర్లను భారీగా తగ్గింది. బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్ల విషయానికి వస్తే.. స్వల్పంగా తగ్గారు.. వీరి సంఖ్య 78.34 కోట్ల నుంచి 78.33 కోట్లకు తగ్గారు. మొబైల్‌ సర్వీసెస్‌ విభాగంలో రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లను భారీగా కస్టమర్లను కోల్పోయాయి. ఒక్క ఎయిర్ టెల్ మాత్రమే కొత్త కస్టమర్లను దక్కించుకుంది. దాంతో ఫిబ్రవరి నెలలో ఎయిర్‌టెల్‌ కొత్తగా 15.91 లక్షల మందిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రిలయన్స్ జియో మాత్రం వరుసగా మూడోసారి తన యూజర్లను ఆకట్టుకోలేక కోల్పోయింది.

Airtel Gains 1.59 Million Subscribers In Feb; Jio, Voda Idea Lose Trai Data 

ఇదే నెలలో జియో నుంచి 36.6 లక్షల మంది మొబైల్ కస్టమర్లు మరో నెట్‌వర్క్‌కు మారిపోయారు. ఫలితంగా ఆ నెలలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.27 కోట్లకు చేరింది. ఇదిలా ఉండగా.. ఫిక్స్‌డ్‌ లైన్‌ కస్టమర్లు క్రమంగా పెరుగుతున్నారని ట్రాయ్ డేటా వెల్లడించింది. ప్రస్తుతం ఈ కస్టమర్ల సంఖ్య 2.42 కోట్ల నుంచి 2.45 కోట్లకు పెరిగారని తెలిపింది. ప్రైవేటు టెలికం కంపెనీలు తమ కస్టమర్ బేస్ పెంచుకుంటూ పోతుంటే.. ప్రభుత్వ టెలికం సంస్థలైన BSNL, MTNL కంపెనీలు మాత్రం తమ యూజర్ బేస్ పెంచుకోవడంలో వెనకబడ్డాయి. ఇందులో భారతి ఎయిర్‌టెల్‌ 91,243 మంది కొత్త యూజర్లను చేర్చుకోగా.. రిలయన్స్‌ జియో 2.44 లక్షలు, వొడాఫోన్‌ ఐడియా 24,948, టాటా టెలీసర్వీసెస్‌ 3,772 కొత్త యూజర్లను సొంతం చేసుకున్నాయి. BSNL, MTNL కలిసి 70 వేలకు పైగా కస్టమర్లను కోల్పోయినట్టు ట్రాయ్ డేటా పేర్కొంది.

Read Also : Jio Vs Airtel Vs Vodafone : రూ.300లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు.. Daily Data బెనిఫిట్స్ మీకోసం..

ట్రెండింగ్ వార్తలు