Airtel, Jio ఆఫర్లు.. queue up రీఛార్జ్ ప్లాన్లు ఇవే

  • Publish Date - November 27, 2019 / 01:37 PM IST

డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్ల ధరలపై 30శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని టెలికం కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత మొబైల్ టారిఫ్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. అందుకే టెలికో కంపెనీలైన భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ – ఐడియా తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు కాంపెన్సేషన్ కింద కొత్త రీఛార్జ్ ప్లాన్లు ప్రవేశపెట్టాయి. 

అవే.. క్యూ అప్ రీఛార్జ్ ప్లాన్లు (queue up recharge plans). ప్రీపెయిడ్ యూజర్లు ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్ టారిఫ్ పెంపునకు ముందే ఎయిర్ టెల్, జియో కస్టమర్లు ఈ క్యూ రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకోవచ్చునని టెలికం టాక్ ధ్రువీకరించింది. ఎయిర్ టెల్, జియో యూజర్లు.. తమ యాక్టివ్ ప్లాన్ ఉండగానే.. అడ్వాన్స్ రీఛార్జ్ ప్లాన్ తీసుకోవచ్చు.

ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అప్ కమింగ్ రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా కనీసం ఒక రీఛార్జ్ ప్లాన్ మాత్రమైనా టారిఫ్ పెంపు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఎయిర్ టెల్, జియో యూజర్లు ఎలా క్యూ అప్ రీఛార్జ్ ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చో ఓసారి చూద్దాం. 

ఎయిర్ టెల్.. రీఛార్జ్ ప్లాన్ : 
ఎయిర్ టెల్ యూజర్లు.. ఏదైనా Unlimited Combo Planలో ఉంటేనే క్యూ రీఛార్జ్ ప్లాన్ వర్తిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా ఒకటే.. ఏదైనా ఒక రీఛార్జ్ ప్లాన్ తీసుకోండి. ఎప్పటిలానే రీఛార్జ్ చేసుకోండి.. గడువు ముగిశాక అది ఆటోమాటిక్‌గా క్యూ రీఛార్జ్ ప్లాన్ గా మారిపోతుంది.

Airtel Thanks App లేదా ఇతర రీఛార్జ్ పోర్టల్స్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి రీఛార్జ్ చేసుకున్నాక ఎయిర్ టెల్ యూజర్లు.. తమ ప్రస్తుత ప్లాన్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. అప్ కమింగ్ ప్లాన్ వివరాలు కూడా చూసుకోవచ్చు. అంతేకాదు.. ఎయిర్ టెల్ క్యూయింగ్ స్కీమ్ కింద తమ యూజర్ల కోసం అదనంగా రూ.1,699 ఏడాది ప్లాన్ ఆఫర్ చేస్తోంది. 

రిలయన్స్ జియో.. రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్ టెల్ మాదిరిగానే రిలయన్స్ జియోలో రీఛార్జ్ ప్రక్రియ ఒకేలా ఉంటుంది. కానీ, జియో మాత్రం తమ ఈ క్యూ రీఛార్జ్ ప్లాన్లపై యూజర్లకు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తోంది. జియో కస్టమర్లు.. MyJio యాప్‌లో My Plans సెక్షన్ కింద queue up recharge plans అనే ఆప్షన్ ఉంటుంది. యాక్టీవ్ రీఛార్జ్ ప్లాన్ కింద క్యూయిడ్ ప్లాన్ కనిపిస్తుంది. ఇక్కడ యూజర్లు తర్వాతి రీఛార్జ్ ప్లాన్ కోసం queue up చేసేందుకు Acitvate బటన్ పై Tap చేయాలి.