వాళ్లకు మాత్రమే : రీచార్జ్ చేసుకుంటే రూ.4లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్

ఎయిర్‌ టెల్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్‌ చేసుకుంటే సొంత నెట్‌వర్క్‌ సహా ఇతర

  • Publish Date - January 2, 2020 / 02:53 PM IST

ఎయిర్‌ టెల్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్‌ చేసుకుంటే సొంత నెట్‌వర్క్‌ సహా ఇతర

ఎయిర్‌ టెల్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్‌ చేసుకుంటే సొంత నెట్‌వర్క్‌ సహా ఇతర వాటికి కూడా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 1.5జీబీ డేటా, 100 smsలు పొందొచ్చు. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. అంతేకాదు.. ఈ ప్లాన్‌ రీచార్జ్‌ చేసుకోవడం ద్వారా ఎయిర్‌టెల్‌ రూ.4లక్షల హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తోంది. 

ఇక రూ.379 ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌ ద్వారా ఇతర నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ సౌకర్యాన్ని పొందొచ్చు. ఈ ప్లాన్‌లో కేవలం 6 జీబీ డేటా, 900 sms లు ఇస్తున్నారు. అలాగే ఈ ప్లాన్‌తో ఫాస్టాగ్‌ కొనుగోలుపై ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు రూ.100 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తోంది. అదనంగా షా అకాడమీ నుంచి 4 వారాల మ్యూజిక్‌ కోర్సును ఉచితంగా అందించడంతో పాటు.. వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌ టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్రైమ్‌ సర్వీస్‌ సబ్‌స్క్రిప్షన్లను ఇస్తోంది.

ఎయిర్‌టెల్‌ ఇటీవల తమ రూ.558 ప్లాన్‌ వ్యాలిడిటీపై భారీగా కోత విధించిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌పై 26 రోజులు గడువు కుదించింది. దాంతో పాటు మినిమం మంత్లీ రీచార్జ్‌ను(ఎంఎంఆర్‌) సైతం రూ.35 నుంచి రూ.45కు పెంచింది. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే.. ఎయిర్ టెల్ కొత్తగా ఈ 2 ప్లాన్లను తీసుకురావడం విశేషం. మార్కెట్ లో పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికామ్ కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. కస్టమర్లను నిలుపుకోవడం కోసం రకరకాల ప్లాన్లు తీసుకొస్తున్నాయి.