ఎయిర్ టెల్ : రెండు బంపర్ ఆఫర్స్ 

  • Publish Date - January 24, 2019 / 05:51 AM IST

రూ.998, రూ.597 రీఛార్జ్ ప్లాన్స్  
రూ.998 ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు 
రూ.597 ప్లాన్ వ్యాలిడిటీ 168 రోజులు

ఢిల్లీ  : ఎయిర్ టెల్ మరో రెండు బంపర్ ఆఫర్స్ ను ప్రకటించింది. అన్నింటా పోటీ నెలకొన్న క్రమంలో టెలీకాం సంస్థలు రోజు రోజుకు కష్టమర్స్ ను అట్రాక్ట్ చేసేందుకు  పోటీలు పడుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ప్లాన్‌లు ప్రకటిస్తున్నాయి.  ఈక్రమంలో వన్ ఇయర్ వ్యాలిడిటీతో రూ.1699 ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ కష్టమర్స్ కు మరో రెండు ఆఫర్స్ ను ప్రకటించింది. రూ.998, రూ.597 విలువ గల మరో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. 336 రోజుల వ్యాలిడిటీ గల రూ.998 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతినెలకి 300 ఎస్ఎంఎస్ లతో పాటు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 12 జీబీ డేటా లభించనుంది. అంతేకాదు 168 రోజుల వ్యాలిడిటీ గల రూ.597 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతినెలకి 300 ఎస్ఎంఎస్ లతో పాటు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 6 జీబీ డేటాని పొందనున్నారు.