వినూత్న పాలసీ : దోమ కాటుకు బీమా

  • Publish Date - September 27, 2019 / 03:21 AM IST

దోమకాటుకు బీమా ? అని నోరెళ్లబెట్టకండి. ఇది నిజం. ఏడు రకాల వ్యాదులు సోకితే..పరిహారం అందించేలా..ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లు సంయుక్తంగా ఈ పాలసీని అందుబాటులోకి తెచ్చాయి.ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను ఉపయోగిస్తున్న వారు ఏడాదికి రూ. 99 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ వెల్లడించింది. దాదాపు 40 లక్షల మందికి పైగా తమ ఖాతాదారులకు ఈ పాలసీని అందించనున్నట్లు వెల్లడించింది.

రోజు వారి ఆదాయం పొందే వారు, ఒక రోజు ఆస్పత్రిలో ఉన్నా..వారి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా తయారవుతుందని..ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఎండీ, సీఈఓ అనుబ్రతా విస్వాస్ తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకుండానే..పాలసీని తీసుకోవచ్చని..వాలెట్ ఇన్సూరెన్స్ పోర్ట్‌పోలియోలో భాగంగా ఈ పాలసీని అందిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ త్యాగి వివరించారు. 

డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాదులు విజృంభిస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు ఆస్పత్రులన్నీ జ్వర పీడితులో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన హాస్పిటల్స్‌లో సిబ్బంది, ఇతర సదుపాయాల కొరత ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. డబ్బులు కూడా అధికంగానే ఖర్చవుతోంది. తాజాగా ఎయిర్ టెల్ తీసుకొచ్చిన బీమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.