Motorola Edge 50 Ultra : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. అతి తక్కువ బడ్జెట్‌లోనే ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాపై భారీ తగ్గింపు పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్‌లో పీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్, 4,500mAh బ్యాటరీ ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఆఫర్లు, ధరలపై ఓసారి లుక్కేయండి.
2/6
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాపై డీల్ : ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ రూ. 49,999కు అందుబాటులో ఉంది. ఈ మోటోరోలా ఫోన్ (12GB + 512GB) వేరియంట్ లాంచ్ ధరతో పోలిస్తే రూ. 15వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
3/6
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. తద్వారా ఈ ఫోన్‌ను నెలకు రూ. 1,758 ప్రారంభ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫోన్ వాల్యూ, వర్కింగ్ కండిషన్ ప్రకారం డిస్కౌంట్ పొందవచ్చు.
4/6
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్లు : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, అద్భుతమైన కలర్ కచ్చితత్వం, 2,800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ 125W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
5/6
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా అనేది డిమాండ్ ఉన్న గేమ్‌లు, మల్టీ టాస్కింగ్‌కు బాగా సరిపోయే ఫోన్. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.
6/6
ఈ మోటోరోలా ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో IP68-రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (OISతో) 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 64MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.