Amazon Great Freedom Sale : కొత్త ట్యాబ్ కావాలా? అమెజాన్‌లో రూ.30వేల లోపు టాబ్లెట్‌లపై అద్భుతమైన డీల్స్.. మీ ఫేవరెట్ ఇదేనా?

Amazon Great Freedom Sale : అమెజాన్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. కొత్త టాబ్లెట్ కోసం చూస్తుంటే రూ. 30వేల లోపు ధరలో అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త టాబ్లెట్ కొనేసుకోవచ్చు..

Amazon Great Freedom Sale

  • అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం
  • శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్ ధర రూ.29,999
  • రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో రూ.27,999 ధరకు లభిస్తోంది
  • వన్‌ప్లస్ ప్యాడ్ 2 ధర రూ.31,999 మాత్రమే

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ మొదలైంది.. మీరు కొత్త టాబ్లెట్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ సేల్‌లో అతి చౌకైన ధరకే టాబ్లెట్లను కొనేసుకోవచ్చు. రూ.30వేల లోపు టాబ్లెట్లకు సంబంధించి అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇందులో లెనోవా ఐడియా ట్యాబ్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్, రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో, వన్‌ప్లస్ ప్యాడ్ 2, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 ప్లస్ ఉన్నాయి. రూ.30వేల లోపు (Amazon Great Freedom Sale) టాబ్లెట్లపై బెస్ట్ డీల్స్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లు : 

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా లెనోవో ఐడియా ట్యాబ్ రూ.24,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.1,750 వరకు లభిస్తుంది. దాంతో ధర రూ.23,249 అవుతుంది. లెనోవో ఐడియా ట్యాబ్‌లో 500 నిట్స్ బ్రైట్‌నెస్,11-అంగుళాల 2.5K డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్ రూ.29,999 ధరకు లభిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.1750 వరకు లభిస్తుంది.

Read Also : Samsung Galaxy S25 Ultra : వావ్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5జీపై ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో రూ. 40వేలు తక్కువకే..

తద్వరా ఈ ఫోన్ ధర రూ.28,249 అవుతుంది. గెలాక్సీ ట్యాబ్ S10 లైట్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 10.9-అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP42 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి.

అమెజాన్ సేల్‌లో రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో ధర రూ.27,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.1750 వరకు పొందవచ్చు.

అసలు ధర రూ.26,249 అవుతుంది. ప్యాడ్ 2 ప్రోలో 12.1-అంగుళాల 2.5K డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ డాల్బీ విజన్ అటామ్స్ సపోర్ట్ ఉన్నాయి. ఇందులో 12000mAh బ్యాటరీ ఉంది. ఈ టాబ్లెట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు.

అమెజాన్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ 2 ధర రూ.31,999 :

బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.1750 వరకు పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.30,249 అవుతుంది. ప్యాడ్ 2 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 12.1-అంగుళాల 3K డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టాబ్లెట్‌లో 9,610mAh బ్యాటరీ ఉంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ అందించారు. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 ప్లస్ రూ.23,999 ధరకు లభిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.1,750 వరకు పొందవచ్చు. తద్వరా ఈ ప్యాడ్ ధర రూ.22,249 అవుతుంది. గెలాక్సీ ట్యాబ్ A11 ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ట్యాబ్లెట్‌లో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి.