Amazon Sale Offers : గెట్ రెడీ.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కు సంబంధించి ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.. ఎలాగంటే?

Amazon Sale Offers

Amazon Great Indian Festival Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ మెగా సేల్ ప్రారంభానికి ముందే అనేక డీల్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. మీరు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తుంటే అమెజాన్ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం అమెజాన్ అందించే ఈ స్మార్ట్‌ఫోన్లను భారీ తగ్గింపు ధరలకే పొందవచ్చు.

మీరు శాంసంగ్ ఫోల్డబుల్ (Amazon Sale Offers) కొనాలన్నా లేదా వన్‌ప్లస్ ఫోన్ కొనాలన్నా ప్రతి ఫోన్‌పై అద్భుతమైన డీల్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సేల్‌కు ముందే వన్‌ప్లస్, వివో X200 ప్రో, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 వంటి డీల్స్ ఎలా పొందాలో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 13 :
256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ 13 12GB ర్యామ్ వేరియంట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో రూ.57,999కు లభిస్తుంది. అసలు ధర రూ.69,999 నుంచి తగ్గింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ర్యామ్ కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మూడు 50MP సెన్సార్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

Read Also : Best iPhone Deals : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్‌కు ముందే బెస్ట్ ఐఫోన్ డీల్స్ ఇవే.. ఆ 2 ఐఫోన్లు తప్ప ఏదైనా కొనేసుకోండి..!

వివో X200 ప్రో :
వివో X200 ప్రో ఫోన్ అసలు లాంచ్ ధర రూ.94,999 ఉండగా బ్యాంక్ ఆఫర్లతో రూ.87,999 ధరకు అమ్మకానికి ఉంది. వివో X200 ప్రో ఫీచర్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 200MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు బెస్ట్ ఆప్షన్‌. 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 అసలు ధర రూ.1,09,999 నుంచి రూ.97,999 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. స్పెషిఫికేషన్ల విషయానికొస్తే.. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 మోడల్ 6.9-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X ఇన్నర్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 4.1-అంగుళాల కవర్ డిస్‌ప్లే కలిగి ఉంది. 12GB ర్యామ్, ఎక్సినోస్ 2500 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 50MP ప్రైమరీ షూటర్, 12MP సెకండరీ షూటర్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.