Amazon Sale 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025.. ఈ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై టాప్ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు..!

Amazon Great Indian Festival Sale 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది.

Amazon Great Indian Festival Sale 2025

Amazon Great Indian Festival Sale 2025 : దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లేయర్లలో ఒకటైన అమెజాన్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సెప్టెంబర్ 23 నుంచి లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని ధృవీకరించింది. అయితే, ఎప్పటిలాగే, అమెజాన్ ప్రైమ్ సభ్యులు 24 గంటల ముందస్తుగా యాక్సెస్‌ను పొందవచ్చు.

ఈ బెస్ట్ డీల్స్ ఆస్వాదించేందుకు రీడీమ్ చేసుకోవచ్చు. అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌లలో కొన్నింటిపై భారీ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సేల్‌లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కస్టమర్‌లకు 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్‌లు పొందవచ్చు. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. శాంసంగ్, ఆపిల్, షావోమీ మరిన్నింటి నుంచి టాబ్లెట్‌లపై 70 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది.

45 శాతం వరకు తగ్గింపుతో ల్యాప్‌టాప్‌లు :

మైక్రోసైట్ ప్రకారం.. ఆసుస్, హెచ్‌పీ, ఏసర్, లెనోవా, డెల్, ఎంఎస్‌ఐ వంటి బ్రాండ్‌లలోని ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. నివిడియా జీఫోర్స్ RTX 3050 జీపీయూ కలిగిన అసూస్ ల్యాప్‌టాప్ అదనపు బ్యాంక్ ఆఫర్‌లతో రూ.60వేల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది.

ఇంటెల్ i5 13వ జనరేషన్ ప్రాసెసర్‌తో HP 15 రూ.50వేల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది. 13వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్‌తో డెల్ ఇన్‌స్పైరాన్ తగ్గింపు ధరకే లభిస్తుంది. ఆసుస్ వివోబుక్ (ల్యాప్‌టాప్) రూ. 80వేలు లోపు ధరకే లభిస్తుంది. 13వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్‌తో లెనోవా ఐడియాప్యాడ్ ధర రూ.60వేల కన్నా తక్కువ లభిస్తుంది. 70 శాతం వరకు తగ్గింపుతో టాబ్లెట్లు పొందవచ్చు.

Read Also : Samsung Galaxy S25 FE : వారెవ్వా.. ఈ 5 కొత్త ఫోన్లు కేక.. శాంసంగ్ గెలాక్సీ S25 FE కన్నా తోపు అంతే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

అమెజాన్ ఇండియా, శాంసంగ్, ఆపిల్, షియోమి వంటి ప్రముఖ కంపెనీల నుంచి టాబ్లెట్లపై ఆఫర్లను వెల్లడించింది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE రూ. 20వేలు (అసలు ధర రూ. 44,999) కన్నా తక్కువ ధర, దాదాపు 40+ శాతం తగ్గింపు.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 రూ. 40వేలు (అసలు ధర రూ. 81,900) కన్నా తక్కువ ధర
ఆపిల్ ఐప్యాడ్ M3-ఆధారిత మోడల్ రూ. 50వేలు లోపు (రూ. 59,900 నుంచి తగ్గింపు).
ఈ డీల్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో కొనుగోలుదారులకు ప్రీమియం టాబ్లెట్‌లను మరింత సరసమైన ధరకే ఆఫర్ చేస్తుంది.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే :
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లతో పాటు, ఈ-కామర్స్ ప్లేయర్‌లు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్ 6, వన్‌ప్లస్ 13 సిరీస్, ఐక్యూ 13 5G వంటి అల్ట్రా-ప్రీమియం మోడల్‌లు ఈ సేల్‌లో భాగంగా అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13ఆర్, ఐక్యూ నియో 10, వివో V60, ఒప్పో రెనో 14 వంటి మిడ్-రేంజ్ మోడల్‌లు కూడా ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, బ్యాంక్ ఆఫర్‌లతో అందుబాటులో ఉంటాయి.