Amazon Great Indian Festival Sale : సూపర్ ఆఫర్ భయ్యా.. ఆపిల్ వాచ్ సిరీస్ 11 మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Amazon Great Indian Festival Sale : ఆపిల్ వాచ్ సిరీస్ 11 ధర భారీ తగ్గింది. రూ. 500 కూపన్‌తో రూ. 35,999కి ధర తగ్గింపు పొందింది. అసలు ధర కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. పూర్తి ఆఫర్ వివరాలివే..

Apple Watch Series 11

  • ఆపిల్ వాచ్ సిరీస్ 11 46mm జీపీఎస్ మోడల్ ధర రూ. 36,499
  • రూ. 500 కూపన్‌తో రూ. 35,999కి ధర తగ్గింపు
  • ఆపిల్ వాచ్ సిరీస్ 11, వాచ్‌ఓఎస్ 26పై రన్నింగ్, 5Gకి సపోర్టు

Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, వేరబుల్స్ మరిన్నింటిపై డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, ఎంపిక చేసిన ప్రొడక్టులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి.

మీరు ఆపిల్ వేరబుల్ కొనాలని చూస్తుంటే.. ఆపిల్ వాచ్ సిరీస్ 11పై స్పెషల్ డీల్ ఉంది. అసలు ధర కన్నా చాలా తక్కువ (Amazon Great Indian Festival Sale) ధరకు లభిస్తోంది. ఎస్బీఐ డెబిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది.

ఆపిల్ వాచ్ సిరీస్ 11 తగ్గింపు :
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 11 46mm జీపీఎస్ వేరియంట్ ధర రూ. 36,499గా ఉంది. అసలు ధర రూ. 46,900 కన్నా రూ. 10,401 తగ్గింపు పొందింది. అంతేకాదు.. ప్రొడక్ట్ పేజీలో అదనంగా రూ. 500 కూపన్ కూడా అందిస్తోంది. అసలు ధర మరింత తగ్గి రూ. 35,999కు లభిస్తుంది.

Read Also : Oppo K14 Plus Sale : ఒప్పో K14 ప్లస్ సేల్ మొదలైందోచ్.. ఇలా కొన్నారంటే చాలా చీపెస్ట్ ధరకే..!

మీరు చెక్అవుట్ వద్ద కూపన్‌ను అప్లయ్ చేస్తే.. ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ. 35,999కే పొందవచ్చు. దాంతో మీకు మొత్తం రూ. 10,901 ఆదా అవుతుంది. కొనుగోలుదారులు వాచ్ సిరీస్ 11 ధరపై బ్యాంక్ ఆఫర్ కూడా పొందొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ కస్టమర్లు రూ. 3వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ధరను మరింత తగ్గించగలదు.

ఆపిల్ వాచ్ సిరీస్ 11 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ వాచ్ సిరీస్ 11 మోడల్ వాచ్‌ఓఎస్ 26పై రన్ అవుతుంది. 5జీ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. ఇందులో కొత్త సిరామిక్ కోటింగ్‌తో ఐయాన్-ఎక్స్ గ్లాస్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ గత జనరేషన్ మోడళ్ల కన్నా రెండు రెట్లు ఎక్కువగా గీతలు పడకుండా ఉంటుందని ఆపిల్ చెబుతోంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ను 100 శాతం రీసైకిల్ చేసిన టైటానియం అల్యూమినియంతో తయారు చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. లైవ్ ట్రాన్స్‌లేషన్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. తద్వారా వినియోగదారులు కాన్వర్జేషన్ నేరుగా వాచ్ నుంచే ట్రాన్సులేట్ చేయొచ్చు.

హెల్త్ మానిటరింగ్ కోసం ఈసీజీ, హార్ట్ రేట్ నోటిఫికేషన్‌లు, స్లీప్ క్వాలిటీ రేట్ చేసే కొత్త స్లీప్ స్కోర్ ఫీచర్లు ఉన్నాయి. హైపర్‌టెన్షన్ నోటిఫికేషన్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. ఆప్టికల్ హార్ట్ సెన్సార్ నుంచి డేటా ద్వారా హార్ట్ రేట్ ఎలా ఉందో మానిటరింగ్ చేస్తుంది. ఈ ఫీచర్ 30 రోజుల వ్యవధిలో డేటాను విశ్లేషిస్తుంది. హైపర్‌టెన్షన్‌కు సంబంధించిన సంకేతాలను గుర్తించిన వెంటనే వినియోగదారులను అలర్ట్ చేస్తుంది.