×
Ad

Realme GT 7 : సూపర్ డిస్కౌంట్ బ్రో.. అమెజాన్‌లో భారీగా తగ్గిన రియల్‌మి జీటీ 7 ఫోన్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువ ధరకే..!

Realme GT 7 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా రియల్‌మి జీటీ 7 ధర రూ.5,200 కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు.

Realme GT 7 (Image Credit To Original Source)

  • భారత్‌లో రియల్‌మి జీటీ 7 ప్రారంభ ధర రూ. 39,999
  • అమెజాన్‌లో రూ.36,998కి తగ్గింపు, రూ.3,001 ఫ్లాట్ డిస్కౌంట్
  • బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో డబ్బులు ఆదా చేయొచ్చు

Realme GT 7 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. మీ పాత ఫోన్‌ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ సేల్ సమయంలో రియల్‌మి జీటీ 7 భారీ తగ్గింపుతో లభిస్తోంది.

అద్భుతమైన పర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్ అందించే స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ రియల్‌మి జీటీ 7 కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం..

రియల్‌మి జీటీ 7 అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో రియల్‌మి జీటీ 7 ప్రారంభ ధర రూ.39,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.36,998కి లిస్ట్ అయింది. రూ.3,001 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ.2,250 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేస్తే మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి ఇంకా తగ్గింపు పొందవచ్చు.

Realme GT 7 (Image Credit To Original Source)

రియల్‌మి జీటీ 7 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి జీటీ 7లో 6.78 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 360Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ HDR10 ప్లస్‌కు సపోర్టు ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ GG7i ప్రొటెక్షన్‌తో వస్తుంది.

Read Also : Republic Day Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌పై ఖతర్నాక్ డీల్స్.. ధర ఎంత తగ్గిందంటే?

హుడ్ కింద, GT 7 మీడియాటెక్ డైమన్షిటీ 9400e ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. రియల్‌మి జీటీ 7లో 50MP మెయిన్ కెమెరా (సోనీ ఐఎమ్ఎక్స్906), 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంది.