Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ ఇండియన్ సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లు
43 అంగుళాల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లు
టాప్ 5 స్మార్ట్ టీవీలు ఇప్పుడు రూ. 12,500 లోపు మాత్రమే
Amazon Great Republic Day Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో అనేక స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సందర్భంగా ఐదు 43-అంగుళాల టీవీ మోడల్స్ సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ ఐదు 43-అంగుళాల టీవీలపై ఓసారి లుక్కేయండి.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఎంచుకుని ఇంటికి తెచ్చుకోండి.
VW 43 అంగుళాలు (109 సెం.మీ) :
రూ. 24,999 ధర విలువైన ఈ టీవీ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో ఇప్పుడు రూ. 12,999కే లభిస్తోంది. అంటే.. రూ. 12వేలు తగ్గింపు పొందింది. 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ క్యూఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ టీవీలో అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్స్, 24W స్పీకర్లు, అనేక కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
ఒనిడా 108 సెం.మీ (43 అంగుళాలు) :
అమెజాన్ సేల్ సమయంలో రూ. 26,790 విలువైన ఈ టీవీని రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. అసలు ధర కన్నా రూ. 11,791 తక్కువకే పొందవచ్చు. ఇతర ఆఫర్లతో టీవీ ధర మరింత తగ్గింపు పొందవచ్చు. 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ టీవీలో అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్‌లు, 20W స్పీకర్లు వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)
కోడాక్ 43 అంగుళాలు (108 సెం.మీ) :
కోడాక్ స్మార్ట్‌టీవీ ఫస్ట్ టైమ్ రూ. 29,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు అమెజాన్ సేల్ సమయంలో రూ. 13,999కే లభిస్తోంది.. అంటే రూ. 16వేలు సేవ్ చేసుకోవచ్చు. ఇతర ఆఫర్ల ద్వారా అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ మోడల్ టీవీ 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్స్, 30W స్పీకర్లు, వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
Read Also : Motorola Edge 50 Pro : అమెజాన్‌లో అద్భుతమైన డీల్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ.10వేలు తగ్గింపు.. ఎలాగంటే?
VW 43 అంగుళాలు (108 సెం.మీ)
సేల్ సందర్భంగా రూ. 43,999 విలువైన ఈ విడబ్ల్యూ టీవీపై రూ. 28వేల నుంచి రూ.15,999 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇతర ఆఫర్లతో అదనపు డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ క్యూఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీలో అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్స్, 40W స్పీకర్లు వైడ్ రేంజ్ నెట్‌వర్కింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
VW 43 అంగుళాలు (109 సెం.మీ) :
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఈ స్మార్ట్ టీవీ మొదట రూ.29,999 ధరకు అమ్ముడైంది. ఇప్పుడు రూ. 12,499 మాత్రమే.. అంటే రూ. 17,500 సేవ్ అవుతుంది. 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీలో అనేక ప్రీ-ఇన్‌స్టాల్ ఓటీటీ యాప్స్, 20W స్పీకర్లు, వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.