Motorola Edge 50 Pro : అమెజాన్‌లో అద్భుతమైన డీల్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ.10వేలు తగ్గింపు.. ఎలాగంటే?
Motorola Edge 50 Pro : మోటోరోలా కొత్త ఫోన్ ఆఫర్ అదిరింది.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో తగ్గింపు ధరకే లభిస్తోంది.. ఆఫర్ వివరాలివే..
Motorola Edge 50 Pro (Image Credit To Original Source)
- ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026
- రూ. 25వేల లోపు ధరలో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో
- అమెజాన్‌లో రూ. 10,503 తగ్గింపుతో లభ్యం
Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. భారత మార్కెట్లో రూ. 35,999 ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 26వేల లోపు ధరకే లభిస్తోంది. డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు, కొనుగోలుదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లను పొందవచ్చు. ఇంతకీ అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 12GB + 256GB వేరియంట్ ధర రూ. 35,999కు లాంచ్ అయింది. కానీ, ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 10,503 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ధర రూ. 25,496కు తగ్గింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

Motorola Edge 50 Pro (Image Credit To Original Source)
అమెజాన్ నెలకు రూ. 896 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. పాత ఫోన్ల నుంచి అప్‌గ్రేడ్ చేసుకుంటే అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. పాత ఫోన్, బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి కొనుగోలుదారులు గరిష్టంగా రూ. 23,950 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.
Read Also : Apple iPhone 17 : అద్భుతమైన డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 మీ బడ్జెట్ ధరలోనే.. ఎంత తగ్గిందంటే?
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల కర్వడ్ pOLED ప్యానెల్‌తో వస్తుంది. ఇంకా, మోటోరోలా ఫోన్ 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. హుడ్ కింద, స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది.
పవర్ పరంగా పరిశీలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500mAh బ్యాటరీని అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
