Amazon Prime Day 2026 : రెడీగా ఉన్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్లు.. టాప్ స్మార్ట్‌ఫోన్‌లు సగం ధరకే..! ఇలాంటి డీల్స్ మళ్లీ రావు..!
Amazon Prime Day 2026 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4న మొదలు కానుంది. ఇప్పటికే అనేక డీల్స్ వెల్లడయ్యాయి, ఈ సేల్ సమయంలో చాలా ఫోన్‌లు అసలు ధరలో సగం ధరకే లభించనున్నాయి.
- Sreehari A
- Published on- June 28, 2026 / 07:15 PM IST
Amazon Prime Day 2026
- కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూసేవారికి అద్భుతమైన ఆఫర్లు
- జూలై 4 నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం
- అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్
- ఈ స్మార్ట్ ఫోన్లు సగానికి సగం ధరకే కొనేసుకోవచ్చు
Amazon Prime Day 2026 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకునేవారికి పండగే.. మళ్లీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ వచ్చేస్తున్నాయి.. ఇటీవల మెమరీ చిప్ కొరత కారణంగా స్మార్ట్ ఫోన్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా మొబైల్ కంపెనీలు ఫోన్ల ధరలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఈ సేల్ సమయంలో దాదాపు చాలా ఫోన్లు సగం ధరకే లభించనున్నాయి. ఈ సేల్‌లో బడ్జెట్ నుంచి ప్రీమియం (Amazon Prime Day 2026) వరకు అన్ని కేటగిరీలలో ఫోన్లపై వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు సేల్ కొనసాగనుంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే ఏయే ఫోన్ ఎంత ధరకు లభిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సరసమైన ఫోన్లు మరింత చౌకగా :
మీరు బడ్జెట్ ఫోన్ కొనాలని చూస్తుంటే.. ఈ అమెజాన్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ M07 ఫోన్ (4GB+64GB) 9 శాతం తగ్గింపుతో కేవలం రూ. 9,999కే లభించనుంది. అదేవిధంగా, శాంసంగ్ గెలాక్సీ M07 (4GB+64GB) 26 శాతం తగ్గింపుతో రూ. 12,499కే కొనేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M17 5జీ (4GB+128GB) 12 శాతం తగ్గింపుతో రూ. 14,499కే లభ్యం కానుంది. ఐక్యూ Z10 లైట్ 5జీ (4GB+64GB) అసలు ధరలో దాదాపు సగానికి రూ. 13,999కే లభించనుంది.
మిడ్ రేంజ్ ఫోన్‌లపై భారీ తగ్గింపులు :
మిడ్ రేంజ్ సెగ్మెంట్ విషయానికి వస్తే.. మోటోరోలా జీ57 పవర్ 5జీ ఫోన్ (8GB+128GB) సుమారు 10 శాతం తగ్గింపుతో లభిస్తుంది. నథింగ్ ఫోన్ (3a) ప్రో 5జీ (12GB+256GB) 30 శాతం తగ్గింపుతో లభిస్తుంది. అదేవిధంగా, వన్‌ప్లస్ నార్డ్ CE6 (8GB+256GB) 16 శాతం తగ్గింపుతో రూ. 36,999కే లభ్యం కానున్నాయి.
చౌకగా అత్యంత ఖరీదైన ఫోన్లు :
ఈ సేల్‌లో ప్రీమియం సెగ్మెంట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. నథింగ్ ఫోన్ (3) (12GB+256GB) ధర రూ. 84,999 ఉంటే.. ఈ సేల్‌లో కేవలం రూ. 40,999కే లభ్యం కానుంది. అలాగే, శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5జీ ధర రూ. 99,999 నుంచి తగ్గి రూ. 72,999కే లభించనుంది.
వన్‌ప్లస్ 13 (స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్)ను 31 శాతం తగ్గింపుతో రూ. 49,999కే ఇంటికి తెచ్చుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా పరంగా ప్రారంభ ధర కన్నా కనీసం రూ. 40వేలు తక్కువకే కొనేసుకోవచ్చు. అనేక ప్రీమియం ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి.
జూలై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో భారీ సేల్స్ :
అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా జూలై 4న గోట్ సేల్‌ను ప్రారంభించనుంది. అమెజాన్ సేల్ కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎవరైనా షాపింగ్ చేయవచ్చు. అమెజాన్ మాదిరిగా ఫ్లిప్‌కార్ట్ కూడా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లతో సహా ప్రతి కేటగిరీ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
