క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు ఊపందుకున్న తర్వాత డిజిటల్ వ్యాలెట్లు పెరిగిపోయాయి. పోటీకి తట్టుకోవడానికి ఒకదానికి మించి ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ కార్డులు లేదా ఫోన్లు ఉంటే సరిపోతుంది. వీటన్నిటికీ భిన్నంగా అమెజాన్ కొత్త పద్ధతిని తీసుకురానుంది. మరికొద్ది రోజుల్లో మనముందుకు రానున్న అమెజాన్ టెక్నాలజీ ఏంటో తెలుసా..
హ్యాండ్ స్కానింగ్ పేమెంట్.. అంతే ఏ కార్డులు అవసర్లేదు. ఏ ఫోన్ అవసర్లేదు. కేవలం హ్యాండ్ స్కానింగ్. తరచూ వెళ్లే షాపుల్లో మన చేతిని స్కాన్ చేసి ఉంచితే చాలు. ఇక డబ్బులతో పనిలేదు. మన అకౌంట్లో డబ్బులు ఉంటే ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. ఫోన్లు, వ్యాలెట్లు, కార్డులతో పనిలేకుండా ట్రాన్సాక్షన్ అయిపోతుంటే ఇక దీనిని ఇష్టపడని వారెవరుంటారు.
‘దీని కోసం కస్టమర్లు ముందుగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వివరాలను వారి అకౌంట్లతో యాడ్ చేసుకోవాలి. ఆ అకౌంట్ కు చేతికి సంబంధించిన సమాచారాన్ని స్కాన్ చేసి అందులో ఉంచాలి. ఒకవేళ కార్డుతో ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటే ఇవేమీ అవసర్లేదు. లేదంటే రెగ్యూలర్ గా వెళ్లే షాపుకు వెళ్లి చెయ్యి స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్టే బిల్లింగ్ చేసుకోవచ్చు’
ఈ సిస్టమ్ ను వాడుకలోకి తెచ్చేందుకు అమెజాన్.. వీసా, మాస్టర్ కార్డులను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. జేపీ మోర్గాన్ చేస్, వెల్స్ ఫార్గో కార్డు ప్రొవైడర్లు దీని కోసం సిద్ధమైయ్యారు. 2019 ఆరంభంలోనే అమెజాన్ ఫుడ్ మార్కెట్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది. ఇప్పుడు అది సూపర్ మార్కెట్ చైన్ గా మారిపోయింది.