Apple Layoffs : ఆపిల్‌లో మరోసారి లేఆఫ్స్.. AI దెబ్బకు 200కుపైగా ఉద్యోగాలు ఫట్!

Apple Layoffs : ఆపిల్‌ మరో విడత ఉద్యోగాల కోతకు రెడీ అవుతోంది. సిరి, విజన్ ప్రో, సాఫ్ట్‌వేర్ టీమ్‌లలో 200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ, కొత్త డివైజ్‌లపై ఆపిల్ ఫోకస్ పెంచుతోంది.

Apple job cuts

  • అధికశాతం విజన్ ప్రో టీమ్ నుంచే ఉద్యోగాల కోత
  • 200 మందికి పైగా ఆపిల్ ఉద్యోగులు ఇంటికి
  • ఇంటెలిజెంట్ సిస్టమ్ ఎక్స్‌పీరియన్స్ టీమ్ నుంచి తొలగింపులు
  • ఆపిల్‌లో రీస్ట్రక్చరింగ్.. విజన్ ప్రో నుంచి సిరి వరకు

Apple Layoffs : ఐటీ రంగంలో ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు.. ఏఐ దెబ్బకు జాబ్స్ ఊడిపోతున్నాయి. చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. వరుసపెట్టి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఐటీ దిగ్గజ కంపెనీలు ఏఐ రేసులో దూసుకుపోతున్నాయి.

ఈ క్రమంలో ఏఐ ప్రణాళికలతో ముందుకు సాగుతూ పాత ఉద్యోగులను ఏరివేస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఉద్యోగాల్లో కోత విధించిన ఆపిల్ మరోసారి ఉద్యోగాల కోతకు రెడీ అవుతోంది. ఈ టెక్ కంపెనీ ఈసారి సిరి, విజన్ ప్రో, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పలు టీమ్‌ల నుంచి తొలగించనుంది.

200కుపైగా ఉద్యోగాల్లో కోత :
నివేదికల ప్రకారం.. మొత్తంగా 200 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువ కోతలు విజన్ ప్రో టీమ్‌లోనే ఉండనున్నాయి. సుమారు 100 మంది ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. మరో 100 మందికిపైగా సిరి, సాఫ్ట్‌వేర్ సంబంధిత టీమ్‌ల నుంచి ఉద్యోగాలు కోల్పోనున్నారు.

Read Also : Tesla EVs Recall : టెస్లాకు భారీ షాక్.. 29.8 లక్షల EV కార్లు రీకాల్! చైనాలో ఏం జరిగింది? అసలు సమస్య ఇదే!

ఆపిల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కేటగిరీలో భాగమైన ఇంటెలిజెంట్ సిస్టమ్ ఎక్స్ పీరియన్స్ టీమ్‌లోనూ భారీగా ఉద్యోగాల కోత ఉండనుంది. ఈ టీమ్ కొన్ని ఏఐ ఆధారిత ఫీచర్ల డెవలప్‌మెంట్‌పై పనిచేస్తోంది.

ఈ ఉద్యోగులపై ప్రభావం :
విజన్ ప్రో టీమ్‌లో గేమింగ్, ఇమ్మర్సివ్ వీడియో కంటెంట్ వంటి ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులపై కోతల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అయితే, విజన్ ప్రో లేదా visionOSను ఆపిల్ పూర్తిగా నిలిపివేయడం లేదని ఉద్యోగులకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అదేవిధంగా, భవిష్యత్ ప్రొడక్టులు, ఏఐ సామర్థ్యాలు, కొత్త డివైజ్‌లపై కంపెనీ మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా కొన్ని టీమ్‌లను రీస్ట్రక్చరింగ్ చేయనున్నట్టు ఆపిల్ చెబుతోంది.

టెక్ కంపెనీలు ఏఐ వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. కొత్త టెక్నాలజీకి పెట్టుబడులు పెరుగుతున్నా, మరోవైపు పాత విభాగాల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. తద్వారా పెద్ద టెక్ కంపెనీలో జాబ్ ఉన్నా భవిష్యత్తుకు పూర్తి గ్యారెంటీ లేదనే చర్చ మళ్లీ మొదలైంది.