iPhone 16 Pro Price : ఖతర్నాక్ ఆఫర్ భయ్యా.. ఐఫోన్ 16 ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇంత తక్కువకు మళ్లీ జన్మలో రాదంతే..!

iPhone 16 Pro Price : ఆపిల్ ఐఫోన్ అభిమానులు ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు.. ఐఫోన్ 16ప్రోపై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 16 Pro Price

iPhone 16 Pro Price : సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ వస్తోంది. ఐఫోన్ 16 ప్రో కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే.. ప్రస్తుతం అమెజాన్ ఈ ఆపిల్ ఫోన్‌పై భారీ (iPhone 16 Pro Price) డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 16 ప్రో అనేది ఆపిల్ టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.

ప్రస్తుత ఆఫర్‌తో ఏకంగా రూ. 11వేల వరకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుత పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటే మాత్రం ఇంకా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో తెలుసుకుందాం..

అమెజాన్ ఐఫోన్ 16 ప్రో డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ.1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం రూ.1,11,900కి లభ్యమవుతుంది. ఐఫోన్ 16 ప్రోపై రూ.8వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను కూడా ట్రేడ్ చేయవచ్చు. తద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.

Read Also : PM Kisan : బిగ్ అలర్ట్.. ఇలా చేస్తేనే పీఎం కిసాన్ రూ. 2వేలు.. ఇంట్లో నుంచే e-KYC పూర్తి చేయొచ్చు.. స్టేటస్ చెకింగ్ ఎలాగంటే?

ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్ (iPhone 16 Pro Price) 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. HDR10, డాల్బీ విజన్ సపోర్టుతో వస్తుంది. ఐఫోన్ 16 ప్రోలో ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ ఉంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ఫోన్ 25W వైర్డు, 15W వైర్‌లెస్, 4.5W రివర్స్ వైర్డు సపోర్ట్‌, 3582mAh బ్యాటరీతో వస్తుంది. ఐఫోన్ యూజర్లు ఈ అద్భుతమైన ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు.