iPhone 16e : ఇది కదా డిస్కౌంట్.. ఐఫోన్ 16eపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఇలా కొనేసుకోండి!
Apple iPhone 16e : ఐఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఐఫోన్ 16e ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 10,900 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ మీకోసమే..

Apple iPhone 16e
Apple iPhone 16e : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుతం విజయ్ సేల్స్ ఐఫోన్ 16eపై రూ. 10,900 కన్నా భారీ (iPhone 16e) తగ్గింపును అందిస్తోంది.
మీ పాత ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా మొదటిసారి ఐఫోన్‌కు మారేందుకు చూస్తున్నా ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఈ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐఫోన్ 16e డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ రూ. 59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 52,490కు లిస్ట్ అయింది. రిటైలర్ ఈ ఐఫోన్ కొనుగోలుపై రూ. 7,410 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 3,500 తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఐఫోన్ అల్యూమినియం డిజైన్, ఫేస్ ఐడీ సపోర్ట్‌తో వస్తుంది. హుడ్ కింద, ఐఫోన్ 16e ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16e 48MP మెయిన్ కెమెరా 2x ఆప్టికల్ జూమ్, 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ ఇమేజ్ క్లీనప్ టూల్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, ChatGPT ఇంటిగ్రేషన్, రైటింగ్ టూల్స్ వంటి అనేక రకాల ఏఐ ఫీచర్లను అందిస్తుంది, ఇంకా, ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ USB-C పోర్ట్‌ను కలిగి ఉంది. IP68 సర్టిఫైడ్‌ను కలిగి ఉంది.
భారత మార్కెట్లో ఐఫోన్ 16e ఫోన్ రూ. 59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో లభ్యమవుతుంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.52,490కి లస్ట్ HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 3,500 తగ్గింపు పొందవచ్చు.