Apple iPhone 16e : ఆపిల్ ఐఫోన్ 16e అతి చౌకైన ధరకే.. రూ. 10వేలకు పైగా డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ జన్మలో రాదు..!

Apple iPhone 16e : ఆపిల్ ఐఫోన్ 16e అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/5Apple iPhone 16e
Apple iPhone 16e : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన డీల్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్స్ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ రెండు ప్లాట్‌ఫారాల డీల్స్ ముగిసినా డీల్స్ మాత్రం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తే ఇదే బెస్ట్ టైమ్.
2/5Apple iPhone 16e
కొత్త ఐఫోన్‌ కొనాలని అనుకుంటే విజయ్ సేల్స్ ద్వారా ఈ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం రిటైలర్ ఐఫోన్ 16eపై రూ. 10వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో ఇదొకటిగా చెప్పొచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. వెంటనే కొనేసుకోవడం బెటర్.. ఐఫోన్ 16e డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
3/5Apple iPhone 16e
ఐఫోన్ 16e డీల్ పొందాలంటే : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e రూ. 59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 52,900కు లిస్ట్ అయింది. రిటైలర్ ఐఫోన్ 16eపై రూ. 7వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 3,500 డిస్కౌంట్ పొందవచ్చు.
4/5Apple iPhone 16e
ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందిస్తుంది. ఈ ఐఫోన్ అల్యూమినియం బిల్డ్‌ కలిగి ఉంది. ఫేస్ ఐడీ సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద, ఐఫోన్ 16e ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది.
5/5Apple iPhone 16e
ఫొటోగ్రఫీ పరంగా ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా ఉంది. ఈ ఐఫోన్ ఇమేజ్ క్లీనప్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. రైటింగ్ టూల్స్ వంటి అనేక ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16e ఇతర ఫీచర్లలో USB-C పోర్ట్, వాటర్, డస్ట్ నిరోధకతకు IP68 సర్టిఫికేషన్ ఉన్నాయి.