Apple iPhone 17 Pro Max (Image Credit To Original Source)
Apple iPhone 17 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? మీరు ఐఫోన్ 17 మోడల్ కొనాలనుకుంటే ఈ ఆఫర్ మీకోసమే. ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రీమియం మోడల్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఈ ఐఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్‌ను అందిస్తోంది. ఐఫోన్లు, ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్ మరిన్నింటితో సహా అనేక రకాల ఆపిల్ ప్రొడక్టులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
ఈ సేల్ ఆఫర్లలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఒకటి. ఈ ఐఫోన్ (Apple iPhone 17 Pro Max) కొనుగోలుపై రూ. 16వేల కన్నా ఎక్కువ ఆదా చేయొచ్చు. హై-ఎండ్ ఐఫోన్ కోరుకునే కొనుగోలుదారులకు ఈ లిమిటెడ్ టైమ్ డీల్ అద్భుతంగా ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో ఇంకా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఏయే డీల్స్ ఉన్నాయో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ.1,49,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.1,38,490కి లిస్టు అయింది. అంటే రూ.11,410 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Apple iPhone 17 Pro Max (Image Credit To Original Source)
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే, యాంటీ-రిఫ్లెక్టివ్ డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద ఈ ఐఫోన్ A19 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఐఫోన్ 39 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని చెబుతున్నారు.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 4x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP కెమెరా ఉంది. అలాగే స్టీమ్ రూమ్ చాంబర్ కూడా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సిరామిక్ షీల్డ్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఐఫోన్ మోడల్ iOS26పై రన్ అవుతుంది.