iPhone Duo Price in India: ఆపిల్ నుంచి ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్.. ఐఫోన్ డుయో నుంచి యాపిల్ వాచ్ వరకు.. భారత్‌లో ధరలు ఇవే!

iPhone Duo Price in India: టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన ఉత్పత్తులతో మార్కెట్‌లో సందడి చేసింది. ఏకంగా ఐదు కొత్త ప్రొడక్ట్స్‌ను ఆవిష్కరించింది.

iPhone Duo Price in India

iPhone Duo Price in India: టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన ఉత్పత్తులతో మార్కెట్‌లో సందడి చేసింది. సెప్టెంబర్ 9న నిర్వహించిన ఈవెంట్‌లో ఒకటి కాదు.. ఏకంగా ఐదు కొత్త ప్రొడక్ట్స్‌ను ఆవిష్కరించింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ను ఐఫోన్ డ్యూయో పేరుతో విడుదల చేసింది. దీనితోపాటు.. ఐఫోన్ 18ప్రో, ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్, కొత్త యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ ఆల్ట్రా 4, ఎయిర్‌పాడ్స్ 5‌లను కంపెనీ ఆవిష్కరించింది. ఈ ఐదు ఉత్పత్తులన్నీ భారతదేశంలోనూ అందుబాటులోకి రానున్నాయి.

Also Read : Apple Foldable iPhone Duo : వామ్మో.. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ ధరతో ఈ కార్లు కొనేయొచ్చు..

భారత్‌లో ఫోల్డబుల్ ఫోన్‌ ‘ఐఫోన్ డ్యూయో’ ధరలను పరిశీలిస్తే..
♦ ఐఫోన్ డ్యూయో ధర అమెరికాలో 1999 డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 1.90 లక్షల వరకు ఉంటుంది. అయితే, భారతదేశంలో మాత్రం ప్రారంభ ధర దాదాపు రూ. 3లక్షల వరకు ఉండటం గమనార్హం.
♦ ఐఫోన్ డ్యూయో 256GB : రూ. 2,99,900
♦ ఐఫోన్ డ్యూయో 512GB : రూ. 3,24,900
♦ ఐఫోన్ డ్యూయో 1TB : రూ. 3,74,900
♦ ఐఫోన్ డ్యూయో : 2TB రూ. 4,49,900.
♦ ఈ ఫోన్లు సెప్టెంబర్ 12న ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభం కాగా, సెప్టెంబర్ 18న అమ్మకాలు మొదలవుతాయి.

భారత్‌లో ఐఫోన్ 18ప్రో, 18ప్రో మ్యాక్స్ ధరలు
♦ ఐఫోన్ 18 ప్రో ధర అమెరికాలో 1199 డాలర్లుగా (రూ. 1.14 లక్షల వరకు) ఉంది.
♦  ఇండియాలో అయితే, ఐఫోన్‌ 18 ప్రో 256GB వేరియంట్‌ రూ.1,64,900
♦ 512GB ధర రూ.1,89,900
♦ 1TB ధర రూ.2,39,900
♦ 2TB ధర రూ.3,14,900గా ఉంది.

ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్ ధరలు.. 
♦ ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్ ధర అమెరికాలో 1299 డాలర్లుగా ఉంటే..
♦ ఇండియాలో ఐఫోన్ 18ప్రోమ్యాక్స్ 256GB ధర రూ.1,79,900
♦ 512GB రూ.2,04,900
♦ 1TB రూ.2,54,900
♦ 2TB రూ.3,29,900గా ఉన్నాయి.
♦ సెప్టెంబర్ 12న ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభం కాగా, సెప్టెంబర్ 18న అమ్మకాలు మొదలవుతాయి.

♦ ఐఫోన్‌లతో పాటు Apple Watch Series 12, Apple Watch Ultra 4ను కూడా ఆపిల్ ఆవిష్కరించింది.
♦ ఆపిల్ వాచ్ సిరీస్ 12 అల్యూమినియం వేరియంట్ ధర రూ. 56,900 నుండి ప్రారంభమవుతుంది. టైటానియం, సిరామిక్ మోడళ్ల ధరలు వరుసగా రూ. 99,900 మరియు రూ. 1,24,900గా ఉన్నాయి. వాచ్ అల్ట్రా 4 ధర రూ. 1,09,900. అయితే, టైటానియం మిలనీస్ లూప్ వేరియంట్ ధర రూ. 1,24,900గా ఉంది.
♦  వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్ లేకుండా ఎయిర్‌పాడ్స్ 5 ధర రూ. 14,900గా ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్‌తో కూడిన ఎయిర్‌పాడ్స్ 5 వేరియంట్ ధర రూ. 17,900గా ఉంది.