Apple to pay whopping Rs 40 lakh a month as rent for its Delhi Store which is smaller than Mumbai store
Apple Retail Stores : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) భారత మార్కెట్లో తమ సర్వీసులను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక సర్వీసులను అందిస్తున్న ఆపిల్.. దేశ ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలో రెండు రిటైల్ స్టోర్లను ఓపెన్ చేస్తోంది. ఈ రెండు స్టోర్లను ఆపిల్ లీజ్ కూడా చేసుకుందట.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సెలెక్ట్ సిటీ వాక్, సాకెట్‌లో ఉన్న ఢిల్లీ స్టోర్ (Delhi Apple Store) ముంబైలోని ఆపిల్ (BKC Store) స్టోర్ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే, రెండు స్టోర్లకు అద్దె ఒకే విధంగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
లీజు ఒప్పంద పత్రాలను మనీకంట్రోల్ (MoneyControl) యాక్సెస్ చేసింది. ఆపిల్ ఢిల్లీ స్టోర్‌తో పాటు ముంబై స్టోర్‌కు నెలకు దాదాపు రూ. 42 లక్షలు అద్దెగా చెల్లిస్తుందని నివేదిక తెలిపింది. ఢిల్లీ ఆపిల్ స్టోర్ విస్తీర్ణం విషయానికొస్తే.. చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ స్టోర్ 8,417.38 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ముంబై స్టోర్ తర్వాత త్వరలో ఈ ఢిల్లీ స్టోర్ ఓపెన్ చేయనుంది. మూడు అంతస్తులలో 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరింత పెద్దదిగా ఉంటుంది.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ స్టోర్ కోసం లీజు జూలై 18, 2022న ఆపిల్ సంతకం చేసింది. 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు లీజును పునరుద్ధరించుకునే అవకాశం ఆపిల్‌కు ఉంది. అయితే, ఈ లీజు ముగియడానికి కనీసం 6 నెలల ముందు ఆపిల్ మాల్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆపిల్ సెలెక్ట్ సిటీవాక్ మాల్‌తో 8,400 చదరపు అడుగుల స్థలం కోసం లీజుపై సంతకం చేసింది. దాంతో పాటుగా CAM (కామన్ ఏరియా మెయింటెనెన్స్ ఛార్జీలు) ఒక చదరపు అడుగుకి సుమారు 475 అద్దె చెల్లించనుంది.
Apple Retail Stores to pay whopping Rs 40 lakh a month as rent for its Delhi Store which is smaller than Mumbai store
అంటే.. నెలకు దాదాపు రూ.40 లక్షల అద్దెను చెల్లించనుంది. 10 ఏళ్ల లీజు.. ప్రతి 3 సంవత్సరాలకు 15 శాతం పెంపుతో ఐదేళ్ల లాక్-ఇన్ ఉంటుంది. ఈ మాల్‌లోని సగటు స్టోర్ పరిమాణం సుమారు 1,500 నుంచి 2,000 చదరపు అడుగులు ఉంటుంది. కోవిడ్-19 తర్వాత కాలంలో ఢిల్లీ, ముంబైలోని స్టోర్ల అద్దెలు భారీగా పెరిగాయి. వాస్తవానికి ఇదేమి అతిపెద్ద స్టోర్ కాదని నివేదిక తెలిపింది.
ముంబైలో 20వేల చదరపు అడుగుల రిటైల్ స్థలం కోసం ఆపిల్ దాదాపు 42 లక్షల రూపాయలు చెల్లిస్తోందని నివేదిక పేర్కొంది. దీని అర్థం.. ముంబై స్టోర్ ఢిల్లీ స్టోర్ కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. రిటైల్ స్థలం ధర ఢిల్లీ కన్నా ముంబైలోనే తక్కువగా ఉంటుంది. రిటైల్ స్థలం చదరపు అడుగు ధర ముంబై కన్నా ఢిల్లీలోనే ఎక్కువగా ఉందని లీజ్ ఒప్పందం సూచిస్తుంది. ఢిల్లీ స్టోర్ ఎప్పుడూ క్రౌడ్ ఉండే మాల్‌లో ఉన్నప్పటికీ.. రిటైల్ స్థలం ఖరీదు ఆర్థిక కేంద్రమైన ముంబై స్టోర్ కన్నా చాలా ఖరీదైనదని నివేదిక పేర్కొంది.
Read Also : First Apple Offline Stores : భారత్‌లో ఫస్ట్ ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్లు.. ఈ రెండు నగరాల్లోనే.. లాంచ్ ఎప్పుడంటే?