Apple Company Shoes : యాపిల్ కంపెనీ షూస్ .. ధర వింటే షాకే

యాపిల్ షూష్ కనువిందు చేస్తున్నాయి. తెల్లటి రంగులో ఉన్న ఈ యాపిల్ అరుదైన స్నీకర్స్ కళ్లు తిప్పుకోనివ్వటంలేదు. వీటి ధర ఎంతో తెలుసా..?

Apple Company Shoes : యాపిల్‌ (Apple )కంపెనీకి చెందిన ఏ వస్తువైనా కాస్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ధర ఎంత చుక్కలు చూపించేలా ఉన్నా వాటిని కొనాలనే ఆసక్తి..ఆశ మాత్రం పోదు. కష్టపడి ఓ ఐఫోన్ కొనుక్కోవాలని సామాన్యులు ఆశపడుతుంటారు. ఐఫోన్ సొంతం చేసుకోవటానికి పడరాని పాట్లు పడుతుంటారు. అటువంటి ఎన్నో వార్తల గురించి సోషల్ మీడియా విన్నాం. చూశాం. కానీ యాపిల్ ఓ వ్యసనం లాగా దాని కోసమే ఆరాటపడుతుంటారు. యాపిల్ ఫోనే కాదు ఆ కంపెనీ వస్తువులు అన్నీ ధరలు వింటేనే షాక్ అవుతాం. కానీ కొనాలనే ఆశమాత్రం పోదే..ఎందుకంటే యాపిల్ పై ఉండే ఆక్రేజే వేరయా అనేలా ఉంటుంది మరి..

అటువంటి యాపిల్ ప్రొడక్ట్ ప్రియులకు మరో శుభవార్త. యాపిల్ షూష్ కనువిందు చేస్తున్నాయి. తెల్లటి రంగులో ఉన్న ఈ యాపిల్ అరుదైన స్నీకర్స్ కళ్లు తిప్పుకోనివ్వటంలేదు. సాధారణంగా మగవారికి షూస్ అంటే చాలా ఇష్టముంటుంది. రకరకాల కంపెనీలకు చెందిన షూష్ కొంటుంటారు. మరి యాపిల్ షూస్ కొనుక్కోవాలని ఆశపడక మానతారా..అటువంటి షూష్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి యాపిల్ స్నీకర్స్..మరి అది యాపిల్ కదా..ధర ఎంతంటారా..?సదా మామూలే..వింటేనే షాక్ అయ్యేలా ఉంది..ఓ జత షూష్ కొనేకంటే ఓ డబుల్ బెడ్ రూమ్ ఇల్లుకొనొచ్చు అనేలా ఉంది. ఐఫోన్, ఐప్యాడ్ మించి ఉందీ ధర..

Amazon Great Freedom Sale : వచ్చేవారమే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు..!

వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడైన షూస్
ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో మేలు రకమైన ఒక నమూనా స్మార్ట్ బూట్లను తయారు చేసింది. కొన్ని కారణాల వల్ల ఈ బూట్ల తాజాగా విక్రయించింది. 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్‌లలో ఒకటైన ప్రఖ్యాత వేలం సంస్థ సోథెబీస్‌ (Famous auction house Sotheby)లో వేలం వేశారు. యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర 50,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 41 లక్షల రూపాయలు. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశాబ్దల మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్‌లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ వెల్లడించింది.

యాపిల్‌ లాంటి కంపెనీ స్నీకర్లను ఉత్పత్తి చేయడం అంటే కాస్త ఆశ్చర్యపోతాం. కానీ ఇప్పుడంటే యాపిల్ ఫోన్లు, ఐప్యాడ్స్, కంప్యూటర్స్, ఇలా ఎన్నో టెక్నాలజీకి సంబంధించినవే మార్కెట్ లో ఉన్నా..ఫ్యాషన్ ప్రపంచంలో కూడా యాపిల్ ముద్రలు ఉన్నాయని గతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. 1986లో “ది యాపిల్ కలెక్షన్”(The Apple Collection)ను ప్రారంభించింది. ఇది రెయిన్‌బో ఆపిల్ లోగోతో అలంకరించి దుస్తులు వంటివి ఉన్నాయి. వీటిలో మగ్‌లు, గొడుగులు, బ్యాగులు, కీరింగ్‌లు, సెయిల్‌బోర్డ్‌తో సహా అనేక రకాల వస్తువులు కూడా ఉన్నాయి. అన్నీ ఐకానిక్ లోగోను కలిగి ఉంటాయి.

Harley Davidson X440 Bookings : ఆగస్టు 3 వరకు హార్లే-డేవిడ్‌సన్ X440 ఆన్‌లైన్ బుకింగ్స్.. డెలివరీలు ఎప్పటినుంచంటే? ఇప్పుడే బుక్ చేసుకోండి!

యాపిల్ వస్తువుల డిమాండ్స్..
ఆపిల్ ఉత్పత్తులు కళ్లు చెదిరే రేట్లకు అమ్ముడుపోవడం ఇదేం మొదటిసారి కాదు.2020లో, హెరిటేజ్ ఆక్షన్ హౌస్ సైట్‌లో మరో జత ఒమేగా స్పోర్ట్స్ ఆపిల్ కంప్యూటర్ స్నీకర్స్ కోసం 20 బిడ్‌లు పొందిన తర్వాత 9,687 డాలర్లకు అమ్ముడైయ్యాయి. కాలిఫోర్నియాలోని ఒక గ్యారేజ్ సేల్‌లో మరో జత స్నీకర్‌లు 2016లో 30,000డాలర్లకు బిడ్‌లో వేలం వేయబడ్డాయి.

ఐఫోన్‌ 2007 మొదటి-ఎడిషన్‌ను (4GB ఐఫోన్‌)190,000డాలర్లు అమ్మగా..యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు చెందిన ఒక జత Birkenstock చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా 200,000డాలర్లకు అమ్ముడుపోయాయి. ఇలా యాపిల్ అంటే చాలు ధర ఎంతైనా కొనేస్తారు యాపిల్ ప్రియులు.

 

 

ట్రెండింగ్ వార్తలు