Home Loan: హోం లోన్ కోసం చూస్తున్నారా? ఈ ఏప్రిల్‌లో హోం లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు.. మీకు ఏ బ్యాంకు బెస్ట్ అంటే?

Home Loan Rates : ఆర్బీఐ రెపో రేటును 5.25శాతం వద్ద స్థిరంగా ఉంచిన నేపథ్యంలో ఏప్రిల్ 2026 నుంచి గృహ రుణాల వడ్డీ రేట్లు 7.10శాతంతో ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికి రుణగ్రహీతల నెలవారీ ఈఎంఐలు పెరగవు.

April 2026 Update Home Loan Rates

  • ఏప్రిల్ నెలలో తక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకులివే
  • గృహ రుణాల వడ్డీ రేట్లు 7.10శాతంతో స్థిరంగా ఉన్నాయి
  • క్రెడిట్ స్కోరు ఎంత ఉంటే బ్యాంకులో లోన్లు ఇస్తారంటే?
  • తక్కువ వడ్డీకే హోం లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఏం చూస్తాయి?

Home Loan: సొంతంటి కల ఎవరికి ఉండదు.. అందరికి సొంత ఇల్లు కొనాలని ఉంటుంది. కానీ, కొంతమంది మాత్రమే ఆ కలను నెరవేర్చుకుంటారు. మీరు కూడా సొంత ఇల్లు కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో హోం లోన్లపై వడ్డీ రేట్లు మారలేదు. అలానే స్థిరంగా ఉన్నాయి.

2026 ఏప్రిల్ ప్రారంభం నుంచి భారతీయ గృహ కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇటీవల జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 5.25 శాతంగా స్థిరంగా ఉంచాలని నిర్ణయించింది.

ఇదే బెస్ట్ టైమ్ ఎందుకంటే? :

ఆర్‌బీఐ నిర్ణయం ప్రకారం.. ప్రస్తుతానికి మీ ఈఎంఐలు పెరగవు. చాలా కాలంగా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వడ్డీ రేట్లు అద్భుతంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. చాలా బ్యాంకుల గృహ రుణాలు బాహ్య బెంచ్‌మార్క్‌కు (రెపో రేటు వంటివి) లింక్ అయి ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం రుణగ్రహీతలకు భారీగా వడ్డీని ఆదా చేసుకోవచ్చు.

Read Also : రెట్రో లవర్స్‌కు గుడ్ న్యూస్..! 80, 90ల నాటి క్యాసెట్ రికార్డర్ రీ-ఎంట్రీ..! ఈసారి మోడర్న్ ఫీచర్లతో!

ప్రధాన బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సీ వడ్డీ రేట్లు :

ప్రస్తుతం, మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉంది. వినియోగదారులకు నేరుగా ప్రయోజనం పొందవచ్చు. వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 7.10 శాతం నుంచి గృహ రుణాలను అందిస్తున్నాయి. అయితే, సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న యూజర్లకు తక్కువ వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటాయి.

వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలు

రుణం కోసం అప్లయ్ చేసేటప్పుడు కేవలం వడ్డీ రేటును మాత్రమే చూడొద్దు. మీ అర్హతను నిర్ణయించేటప్పుడు బ్యాంకులు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.

ఆదాయ వనరు : స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులతో పోలిస్తే.. జీతం తీసుకునే వ్యక్తులు తరచుగా కొంచెం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందవచ్చు.

రుణ మొత్తం : రూ. 30 లక్షల లోపు రూ. 75 లక్షల పైబడిన రుణాలకు వడ్డీ రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు.

క్రెడిట్ హిస్టరీ : మీ గత రికార్డు బాగుండాలి. మీరు సకాలంలో పేమెంట్లు చేసి ఉంటే మీరు బ్యాంకుతో నేరుగా సంప్రదింపులు జరపవచ్చు.

స్మార్ట్ టిప్ :

హోం లోన్ వడ్డీ రేట్లలో 0.05శాతం తగ్గింపు కూడా 20 ఏళ్ల కాలంలో మీకు లక్షల్లో ఆదా చేస్తుంది. మీ బ్యాంకును ఎంచుకునే ముందు కనీసం 3-4 బ్యాంకుల నుంచి ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు, హిడెన్ ఫీజులను తప్పకుండా పోల్చి చూసుకోండి. ఏప్రిల్ నెలలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండి మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే మీకు నచ్చిన ఇంటిని కొనేందుకు సరైన బ్యాంకును ఎంచుకోండి.