Audi Cars SUV : కొత్త కారు కొంటున్నారా? భారీగా పెరగనున్న ఆడి కార్లు, SUV కార్ల ధరలు.. ఎప్పటినుంచంటే?

Audi Cars SUV : ఆడి ఇండియా 2025 మొదటి త్రైమాసికంలో 1,223 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

Audi Cars SUV

Audi Cars SUV : ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా మోడల్ రేంజ్‌లో 2 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది.

Read Also : Tata Curve EV : కొత్త ఎలక్ట్రిక్ కారు భలే ఉందిగా.. సరసమైన ధరకే టాటా కర్వ్ EV కారు.. ఫుల్ ఛార్జ్‌తో 502 కి.మీ రేంజ్!

మారకం రేటు, ఇన్‌పుట్ ఖర్చు పెరుగుదల కారణంగా మే 15 నుంచి మోడళ్ల (ఎక్స్-షోరూమ్) ధర 2 శాతం వరకు పెరుగుతుందని ఆటోమేకర్ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు.

2025 మొదటి త్రైమాసికంలో ఆడి ఇండియా 1,223 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే.. 17 శాతం పెరగనుంది. పాపులర్ మోడళ్లలో ఆడి క్యూ7, క్యూ8 కార్లు ఉన్నాయి.

ఆడి అప్రూవ్డ్ ప్లస్ కూడా 2024 మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. 23 శాతం పెరుగుదలతో భారీ వృద్ధిని నమోదు చేసింది. భారత మార్కెట్లో ఆడి 2024లో 5,816 యూనిట్లను విక్రయించింది.

అంతేకాకుండా, ఈ ఆటోమేకర్ దేశంలో లక్ష యూనిట్లను విక్రయించే మైలురాయిని చేరుకుంది. ఆడి అప్రూవ్డ్ ప్లస్ గత ఏడాదితో పోలిస్తే.. 2024లో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Read Also : EPFO Password : మీ EPFO ​​పాస్‌వర్డ్‌ మర్చిపోయారా? ఎలా రీసెట్ చేయాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

2024 ద్వితీయార్థంలో గత త్రైమాసికంతో పోలిస్తే.. నాల్గవ త్రైమాసికంలో వాల్యూమ్‌లు 36 శాతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన కేంద్రాలలో 26 సౌకర్యాలతో బ్రాండ్ ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ తీర్చేందుకు ఈ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని యోచిస్తోంది.