Bajaj Allianz Life Insurance : ఏపీ, తెలంగాణలో వరద బాధిత పాలసీదారులు ఈజీగా క్లెయిమ్స్ చేసుకోవచ్చు..!

Bajaj Allianz Life Insurance : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధిత పాలసీదారులకు క్లెయిమ్స్ ప్రక్రియను బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ మరింత సులభతరం చేసింది.

Bajaj Allianz Life Insurance simplifies claims process for policyholders

Bajaj Allianz Life Insurance : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. ప్రకృతి విపత్తు సంభవించిన నేపథ్యంలో ప్రభావిత పాలసీదార్లు, వారి కుటుంబాల అవసరాలను పరిష్కరించేందుకు కంపెనీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వరదల బారిన పడిన కస్టమర్ల డెత్, డిజేబిలిటీ క్లెయిమ్‌ల సెటిల్మెంట్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకుంది.

Read Also : Vivo T3 Ultra Launch : కొత్త వివో టీ3 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు, ధర వివరాలు లీక్!

వరద బాధితుల క్లెయిమ్స్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఇన్యూరెన్స్ కంపెనీ చర్యలు చేపట్టింది. దీని ప్రకారం.. క్లెయిమ్ ధృవీకరించేందుకు కీలకమైన డాక్యుమెంటేషన్ ఇస్తే సరిపోతుంది. నామినీలు, చట్టబద్ధ వారసులు లేదా పాలసీదార్లు ఈ కింది విధానాల్లో ద్వారా ఎజెన్షియల్ డాక్యుమెంట్లను మాత్రమే సమర్పించవచ్చు.

· కంపెనీ టోల్-ఫ్రీ నంబరు 18002097272కి కాల్ చేయొచ్చు
· దేశవ్యాప్తంగా ఉన్న 548 శాఖల్లో సమీపంలోని ఏదేని శాఖను సంప్రదించవచ్చు
· claims@bajajallianz.co.in కి ఈమెయిల్ చేయొచ్చు.

అధికారిక వర్గాల నుంచి మృతుల జాబితా, వరద ప్రభావిత కుటుంబాలను చేరుకోవడంపై కంపెనీ మరింతగా కృషి చేస్తోంది.

Read Also : Vivo Y37 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో Y37 ప్రో ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు