Income Tax Rules 2026 : జీతగాళ్లకు జాక్పాట్.. కొత్త ఆదాయపు పన్నుతో చేతికి ఎక్కువ జీతం? పూర్తి లెక్కలివే..!
Income Tax Rules 2026 : దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను నిబంధనల స్థానంలో కొత్త ఆదాయపు పన్ను నియమాలు 2026 రానున్నాయి. మీ జీతంపై నేరుగా ప్రభావం పడుతుంది. కొత్త నిబంధనల ప్రకారం.. HRA పరిమితి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పన్ను తగ్గుతుంది.
New Income Tax Rules 2026 ( Image Credit : Google Gemini AI )
- ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను నియమాలు 2026
- 50శాతం HRA మినహాయింపు నగరాల జాబితా
- పెరగనున్న విద్య, హాస్టల్ అలవెన్సులు
- టేక్ హోం జీతం ఎంత పెరగొచ్చంటే?
Income Tax Rules 2026 : మీ జీతం స్లిప్ మారబోతోంది. ఇకపై టేక్ హోం శాలరీ పెరగబోతుంది. అదే జీతం కానీ కటింగులు తక్కువ.. చేతికి వచ్చే జీతం ఎక్కువ పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రాబోతుంది. దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను నియమం 1961 స్థానంలో డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026 అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త పన్ను నియమాల ప్రకారం.. మీ జీతంపై నేరుగా ప్రభావం పడుతుంది. HRA లిమిట్ పెరగనుంది. అలాగే విద్య, హాస్టల్ అలవెన్సులు కూడా మారనున్నాయి. అంటే.. ఉద్యోగస్తుల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గనుంది అనమాట. కొత్త నిబంధనల ముసాయిదాపై అభిప్రాయాలను ఫిబ్రవరి 22 వరకు తెలియజేయవచ్చు. ఈ మార్పులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
50శాతం HRA మినహాయింపు నగరాలివే :
కొత్త పన్ను నిబంధనల ప్రకారం.. 50శాతం జీతం ఆధారిత HRA మినహాయింపుకు అర్హత ఉన్న నగరాల జాబితాను విస్తరించింది. ఇప్పుడు ఈ నియమాల్లో బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాలు ఉన్నాయి. 40శాతం పరిమితి ఇతర నగరాలకు అమలులో ఉంటుంది.
పెరగనున్న విద్య, హాస్టల్ అలవెన్సులు :
పిల్లల విద్యా భత్యాన్ని నెలకు రూ. 100 నుంచి రూ.3వేలకు పెంచాలని ప్రతిపాదించారు. అదేవిధంగా, హాస్టల్ భత్యం నెలకు రూ. 300 నుంచి రూ.9వేలకు పెరుగుతుంది. ఈ రెండు మార్పులను గరిష్టంగా ఇద్దరు పిల్లలు పొందవచ్చు. అనేక దశాబ్దాల తర్వాత ఈ పరిమితిని పెంచారు. పెరుగుతున్న విద్యా ఖర్చు దృష్ట్యా రెండు పరిమితులను పెంచాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది.
పూర్తి లెక్కలివే :
ఆదాయపు పన్నులో కొత్తు మార్పులతో మీ జీతంపై ఎలా ప్రభావితం పడుతుందో తెలుసుకుందాం.. ఒక వ్యక్తి వార్షిక స్థూల జీతం రూ. 30 లక్షలు అనుకుందాం. ఆదాయపు పన్ను నిబంధనలు, 1962 ప్రకారం.. పిల్లల విద్య భత్యాలు రూ. 2,400 వరకు మినహాయింపు పొందాయి.
అదేవిధంగా, రూ. 7,200 హాస్టల్ భత్యాలు కూడా మినహాయింపు పొందాయి. అదనంగా, రూ. 6 లక్షల హెచ్ఆర్ఏ (నెలకు రూ. 75వేలు అద్దె), రూ. 50వేల స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా, ఆ వ్యక్తి మొత్తం డిడక్షన్లు రూ. 6,59,000, నికర జీతం రూ. 23,40,400 అవుతుంది.
టేక్ హోం జీతం ఎంత పెరగొచ్చంటే? :
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. చాప్టర్ VI-A కింద సెక్షన్లు (80C, 80D, 80CCC, 80CCD) ద్వారా మొత్తం రూ. 4,05,000 మినహాయింపులు క్లెయిమ్ చేస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 19,35,400 అవుతుంది. అంటే ఆ వ్యక్తి పన్ను రూ. 4,08,844.80 అవుతుంది. పన్ను కట్టిన తరువాత ఆ వ్యక్తికి సంవత్సరానికి రూ. 23,47,955.20 (నెలకు సుమారు రూ. 1,95,662.93) టేక్-హోమ్ జీతంగా అందుతుంది.
కొత్త ఆదాయపు పన్ను 2026లో పన్ను గణన ఇలా :
2026 ఆదాయపు పన్ను నిబంధనల ముసాయిదా ప్రకారం.. పిల్లల విద్య భత్యం రూ. 72వేలు మినహాయింపు ఉంటుంది. హాస్టల్ భత్యం రూ. 2,06,000, HRA భత్యం రూ. 7,50,000 మినహాయింపు ఉంటుంది. దాంతో జీతం నుంచి మొత్తం తగ్గింపు రూ. 10,800,000కు పెరుగుతుంది.
పన్ను విధించదగిన ఆదాయం రూ. 15,07,000కు తగ్గుతుంది. దాంతో ఒకరి పన్ను రూ. 2,75,184కు తగ్గుతుంది. మొత్తం పన్ను పొదుపు ప్రతి ఏడాది రూ. 1,33,660.80 అవుతుంది. అప్పుడు వార్షిక టేక్-హోమ్ జీతం రూ. 24,81,616 (నెలకు రూ. 2,06,801.33)కు పెరుగుతుంది. కొత్త పన్ను నిబంధనల ప్రకారం ఒకరి జీతం నెలకు రూ. 11,138.40 అవుతుంది.
పాత పన్ను విధానానికి మళ్లీ ఆదరణ :
పాత పన్ను విధానానికి మళ్లీ ఆదరణ ఎందుకు పెరుగుతుందంటే.. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి పన్ను బాధ్యత రూ. 4,08,845గా ఉంటే.. ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలు 2026 ప్రకారం అది రూ. 2,75,184కి తగ్గుతుంది. కొత్త పన్ను విధానంలో స్లాబ్ల మార్పు కారణంగా ప్రాథమికంగా పన్ను భారం తక్కువగా ఉంటుంది. అంతటితో ఆగదు. కొత్త పన్ను విధానంలో పిల్లల విద్య ఖర్చులతో పాటు HRA అలవెన్సులపై పూర్తి మినహాయింపులు వర్తించవు.
దాంతో మొత్తం పన్ను బాధ్యత రూ. 4,75,800 వరకు చేరుతుంది. వాస్తవానికి ప్రతి పన్నుచెల్లింపుదారునికి లాభం ఒకేలా ఉండదు. ఎక్కువ పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే వారికి పాత విధానం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
పన్ను మినహాయింపులు తక్కువగా ఉన్న టాక్స్ పేయర్లకు మాత్రం కొత్త విధానం లాభదాయకంగా ఉండొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీ ఆదాయం బట్టి అలవెన్సులు, మినహాయింపులతో ఏ పన్ను విధానం బెటర్ అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి.
