Bajaj Chetak 35 Series : టీవీఎస్, ఏథర్‌కు పోటీగా బజాజ్ చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Bajaj Chetak 35 Series : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3లక్షల యూనిట్లు భారతీయ మార్కెట్లో విక్రయించింది. కొత్త అవతార్‌లో, బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, ఏథర్ రిజ్టాకు పోటీగా వస్తుంది.

Bajaj Chetak 35 Series electric scooter

Bajaj Chetak 35 Series Launch : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త 35 సిరీస్‌ను లాంచ్ చేసింది. రూ. 1,27,243 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ప్రారంభ ధరకు చేతక్ ఈవీ స్కూటర్ అందుబాటులో ఉంది. బజాజ్ చేతక్ 35 సిరీస్‌లో 3501, 3502, 3503 అనే మొత్తం 3 వేరియంట్‌లు ఉన్నాయి.

అందులో ఫీచర్-లోడెడ్, టాప్-స్పెక్ 3501 వేరియంట్ ధర రూ. 1,27,243 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు), లో-వేరియంట్ 3502 రూ. 1,20,000 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ధరకు అందుబాటులో ఉన్నాయి.

జనవరి 2020లో లాంచ్ అయినప్పటి నుంచి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3లక్షల యూనిట్లు భారతీయ మార్కెట్లో విక్రయించింది. కొత్త అవతార్‌లో, బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, ఏథర్ రిజ్టాకు పోటీగా వస్తుంది.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ ఆటో అకుర్ది ప్లాంట్‌లో తయారైంది. ఐకానిక్ చేతక్ (పాతది) తయారైన ప్రదేశానికి సమీపంలోనే ప్లాంట్ ఉంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంవత్సరాలుగా స్థిరమైన వృద్ధిని సాధించింది. డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా చేతక్ అవతరించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో మార్కెట్ వాటా పరంగా, బజాజ్ చేతక్ ఏప్రిల్ 2024లో 12శాతం నుంచి డిసెంబర్ 2024లో 27శాతం అసాధారణ వృద్ధిని సాధించింది.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 507 పట్టణాల్లోని వివిధ డీలర్‌షిప్‌ల నుంచి విక్రయించనుందని బజాజ్ ఆటో పేర్కొంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయించే 4వేల కన్నా ఎక్కువ సేల్స్ టచ్‌పాయింట్‌లు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అలాగే, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 4,500 ప్రత్యేక నిపుణులతో 3,800 కన్నా ఎక్కువ సర్వీస్ వర్క్‌షాప్‌లు ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే.. కొత్త చేతక్ 35 సిరీస్ మెటల్ బాడీని కలిగి ఉంది. బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వీల్‌బేస్, సీటు పొడవును విస్తరించింది. అంటే.. ఎక్కువ లెగ్, నీ రూమ్, 35-లీటర్ అండర్ సీట్ స్టోరేజీని కలిగి ఉంది. సీటు పొడవు 80 మిమీ ఉంటుంది.

అలాగే, స్టోరేజ్ స్పేస్, ఇంటిగ్రేటెడ్ మ్యాప్, కాలింగ్ మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్‌లతో కూడిన కొత్త టచ్ టీఎప్టీ డిస్‌ప్లే ఉంది. జియో-ఫెన్సింగ్, యాక్సిడెంట్ డిటెక్షన్‌తో సహా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ఫీచర్లను కంట్రోల్ చేసేందుకు బజాజ్ ఆటో కొత్త యాప్‌ను కూడా అభివృద్ధి చేసింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు 950W ఆన్-బోర్డ్ ఛార్జర్‌ను కలిగి ఉంది. ప్రొటెక్టివ్ కేజ్‌తో కొత్త 3.5kWh బ్యాటరీ ఉంది. కేవలం 3 గంటల్లోనే 0-80శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చని పేర్కొంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ గంటకు 73కి.మీ గరిష్ట వేగంతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 153కిమీలుగా క్లెయిమ్ అయింది.

Read Also : Jeep, Citroen Car Prices : కొత్త కారు కొంటున్నారా? జనవరి 1 నుంచి పెరగనున్న జీప్, సిట్రోయెన్ కార్ల ధరలు.. ఎంతంటే?