Bank Charges
Bank Charges : బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు పెనాల్టీలు, ఛార్జీలు విధిస్తున్నాయి. చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు బ్యాంకు ఖాతాలను బట్టి కనీస బ్యాలెన్స్ పరిమితిని విధించాయి.
ఎవరైనా కస్టమర్లు ఆయా మినిమం బ్యాలెన్స్ లిమిట్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు విధిస్తాయి. అలా కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. ఇటీవలే చాలా ఎస్బీఐ, ప్రైవేటు బ్యాంకులు పెనాల్టీ, ఛార్జీల రూపంలో భారీ మొత్తంలో దండుకుంటున్నాయి.
ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆన్‌లైన్ సర్వీసుల ద్వారా గత ఐదేళ్లలో రూ. 2,300 కోట్లకు పైగా ఆర్జించినట్టు ప్రభుత్వం లోక్‌సభలో పేర్కొంది. అయితే, అందులో ఒక్క ఎస్బీఐ ఏటీఎంల నుంచే క్యాష్ విత్ డ్రా సర్వీసుల ద్వారా గత ఐదేళ్లుగా రూ. 2,043 కోట్లను ఆర్జించినట్టు పేర్కొంది. బ్యాంకు అకౌంట్లో మినిమ బ్యాలెన్స్ నిర్వహణపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఇతర బ్యాంకులతో సహా ఎస్‌బీఐ సైతం ఛార్జీలను విధించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలాంటి పెనాల్టీలు, చార్జీల ద్వారా గత ఐదేళ్లలో రూ.8,495 కోట్లకుపైగా ఆర్జించినట్లు పేర్కొన్నారు.
Read Also : Paytm Users : పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 31 లోపు ఈ పని చేయండి.. లేదంటే భారీగా నష్టపోతారు!
బ్యాంకులు విధించే ఛార్జీల్లో ఎక్కువగా యాన్యువల్ డెబిట్ కార్డు ఫీజు, అకౌంట్ స్టేట్‌మెంట్ ఫిజికల్ కాపీ, ఫోన్ బ్యాంకింగ్, డూప్లికేట్ పాస్‌బుక్, చెక్ క్యాన్సిలేషన్, చెక్ బుక్ ఫీజు వంటి ఎన్నో సర్వీసులపై కస్టమర్ల నుంచి చార్జీలను వసూలు చేస్తున్నాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏటీఎం ఫీజుల రూపంలో ఎస్‌బీఐ రూ.331 కోట్లను ఆర్జించగా, ఇతర 11 ప్రభుత్వ బ్యాంకులు మాత్రం రూ.925 కోట్ల నష్టపోయాయని కేంద్రం లోక్‌సభలో పేర్కొంది.
కస్టమర్లపై ఛార్జీలు ఎందుకంటే? :
ఆర్బీఐ ప్రకారం.. కస్టమర్లు అకౌంట్ సర్వీసు కోసం బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ రూల్ ప్రవేశపెట్టాయి. సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు పెనాల్టీలు, చార్జీల రూపంలో వసూలు చేస్తాయి. కానీ, సేవింగ్స్ అకౌంట్లపై ఆర్బీఐ ఎలాంటి గైడ్ లైన్స్ లేవు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా సహా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్‌కు సంబంధించి పెనాల్టీలను విధించడం లేదు.
మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా :
ప్రతి బ్యాంకు అకౌంటులో నెలకు మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి చేశాయి. అలా లేనిపక్షంలో కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో జరిమానాలు, పెనాల్టీలను విధిస్తున్నాయి పలు బ్యాంకులు. అదే ప్రైవేటు బ్యాంకుల్లో అయితే సేవింగ్స్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే హెచ్‌డీఎఫ్‌సీ రూ.300 నుంచి రూ.600 వరకు పెనాల్టీ విధిస్తోంది. యాక్సిస్ బ్యాంకు రూ.50 నుంచి రూ.600 వరకు జరిమానా విధిస్తోంది.