×
Ad

Bank Holiday Alert : మీకు శనివారం బ్యాంకులో పని ఉందా? నవంబర్ 29న బ్యాంకులకు హాలిడేనా కాదా? వన్ షాట్ ఆన్సర్..!

Bank Holiday Alert : నవంబర్ 29న బ్యాంకులకు సెలవు ఉందా? బ్యాంకులు మూతపడతాయా? మీరు బ్యాంకుకు వెళ్లే ముందు ఈ సెలవుల జాబితాను ఓసారి చెక్ చేయండి.

Bank Holiday Alert

Bank Holiday Alert : మీకు నవంబర్ 29 శనివారం బ్యాంకులో పని ఉందా? అయితే ఇది మీకోసమే.. సాధారణంగా ప్రతినెలలో శనివారాల్లో బ్యాంకులకు కొన్ని సెలవులు ఉంటాయి. అందులో రెండో శనివారం లేదా నాల్గో శనివారం మాత్రమే సెలవులు ఉంటాయి. నవంబర్ 29న శనివారం.. అంటే ఈరోజున కూడా (Bank Holiday Alert) బ్యాంకులకు సెలవు ఉంటుందా? ఉండదా? బ్యాంకుకు వెళ్లాలనుకునే వారిందరికి ఇదే సందేహం ఉంటుంది. గందరగోళం అక్కర్లేదు. మీరు బ్యాంకుకు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు.

నవంబర్ 29న బ్యాంకులు పనిచేస్తాయా? :
శనివారాల్లో బ్యాంకులు మూతపడతయా? లేదా అనే దానిపై ప్రజలు గందరగోళానికి గురవుతారు. ప్రతి నెలలో రెండు శనివారాలు మాత్రమే సెలవులు, రెండో, నాల్గో శనివారాల్లో సెలవు ఉంటుంది. నవంబర్ 29న ఐదవ శనివారం. అయితే ఐదో శనివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఎలాంటి సెలవు లేదు. ఎందుకంటే.. బ్యాంకులకు రెండో, నాల్గో శనివారం మాత్రమే సెలవు ఉంటుంది.

ఇప్పుడు వచ్చే శనివారం ఐదోవది. అంటే బ్యాంకులకు సెలవు ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. ప్రతి నెల రెండో, నాల్గవ శనివారాల్లో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. అయితే, బ్యాంకులు మొదటి, మూడో, ఐదవ శనివారాల్లో తెరిచి ఉంటాయి. నవంబర్ నెలలో ఐదో శనివారం కాబట్టి, శనివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి.

Read Also : Pensioners Alert : పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 30లోపు ఈ 3 పనులు పూర్తి చేయండి.. లేదంటే.. మీకు పెన్షన్ రాదు.. ఏం చేయాలంటే?

నవంబర్ 2025 బ్యాంకు సెలవుల పూర్తి జాబితా

  • నవంబర్ 5 బుధవారం : గురునానక్ జయంతి
  • నవంబర్ 7 శుక్రవారం : వంగల పండుగకు మేఘాలయలో సెలవు.
  • నవంబర్ 8, శనివారం : నెలలో రెండో శనివారం
  • నవంబర్ 11 మంగళవారం : లబాబ్ దుచెన్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులు మూసివేత
  • నవంబర్ 22 శనివారం : నెలలో నాల్గో శనివారం
  • నవంబర్ 30 : ఆదివారం
  • ఇది కాకుండా, అన్ని ఆదివారాల మాదిరిగానే సాధారణ వారంతపు సెలవులు కూడా ఉన్నాయి.

అన్ని ఆదివారాల మాదిరిగానే సాధారణ వారంతపు సెలవులు కూడా ఉన్నాయి. అనేక రాష్ట్రాలు ప్రాంతీయ పండుగలు, స్థానిక పండగలకు సంబంధించిన బ్యాంకు సెలవులను ప్రకటిస్తాయి. నవంబర్‌లో ఇతర నెలలతో పోలిస్తే.. నేషనల్ బ్యాంకులకు చాలా తక్కువ సెలవులు ఉంటాయి. కానీ, ప్రాంతీయ పండుగల సమయంలో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

బ్యాంకింగ్ కార్యకలాపాలు, లావాదేవీల షెడ్యూలింగ్, కస్టమర్ సర్వీసులతో ఈ రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖలు మూతపడతాయి. నవంబర్ 2025 అంతటా బ్యాంకులు 5 రోజుల నుంచి 6 రోజులు మూతపడతాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.