భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మార్చి నెలలో బ్యాంక్ సెలవుల లిస్టును రిలీజ్ చేసింది. దాని ప్రకారం మార్చిలో దేశంలోని అన్ని రాష్ట్రాలట్లో కలిపి బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు ఉన్నాయి.
ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ- నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు కలిపి ఈ సెలవులు ఉన్నాయి.కొన్ని రాష్ట్రాల్లో జరుపుకునే ప్రత్యేకమైన వేడుకల సమయంలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
అలాగే, హోలీ, రంజాన్ వంటి పండుగల వేళ కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. బ్యాంక్ సెలవుల లిస్టును ఆర్‌బీఐ ప్రతి నెల రీలీజ్ చేస్తుంది.
Also Read: డొనాల్డ్ ట్రంప్‌కి ఇంకో ఝలక్.. ఆయన నిర్ణయానికి బ్రేక్
సెలవుల లిస్టు
- మార్చి 2 (ఆదివారం) – వీక్లీ హాలీడే
- మార్చి 7 (శుక్రవారం): చాప్చర్ కుట్ – మిజోరంలో బ్యాంకులకు సెలవులు
- మార్చి 8 (రెండవ శనివారం) – సెలవు
- మార్చి 9 (ఆదివారం) – వీక్లీ హాలీడే
- మార్చి 13 (గురువారం): హోలికా దహన్, అట్టుకల్ పొంగళ – ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, కేరళలో బ్యాంకులకు సెలవు
- మార్చి 14 (శుక్రవారం): హోలీ – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవు
- మార్చి 15 (శనివారం): పలు రాష్ట్రాల్లో హోలీ – కొన్ని నగరాల్లో సెలవు (అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నా వంటివి)
- మార్చి 16 (ఆదివారం) – వీక్లీ హాలీడే
- మార్చి 22 (నాల్గవ శనివారం): సెలవు
- మార్చి 23 (ఆదివారం) – వీక్లీ హాలీడే
- మార్చి 27 (గురువారం): షబ్-ఎ-ఖాదర్ – జమ్మూలో సెలవు
- మార్చి 28 (శుక్రవారం): జుమత్-ఉల్-విదా – జమ్మూకశ్మీర్‌లో సెలవు
- మార్చి 30 (ఆదివారం) – వీక్లీ హాలీడే
- మార్చి 31 (సోమవారం): రంజాన్-ఈద్ – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో సెలవు