Bank of Baroda FD : సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే ఛాన్స్.. ఈ బ్యాంకులో 555 రోజుల FDపై భారీ వడ్డీ.. పూర్తి లెక్కలివే..!

Bank of Baroda FD : బ్యాంక్ ఆఫ్ బరోడాలో కనీసం 7 రోజుల టెన్యూర్‌తో FD ఖాతాను ఓపెన్ చేయొచ్చు. 555 రోజుల ఎఫ్ డీలపై గరిష్టంగా ఎంతవరకు వడ్డీ వస్తుందో ఇప్పుడు చూద్దాం..

Bank of Baroda FD

Bank of Baroda FD : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. మీకు ఈ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతా ఉందా? లేదంటే ఇప్పుడు FD చేద్దామని అనుకుంటున్నారా? బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) FD ఖాతాలపై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది.

ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో రూ. 3 కోట్ల లోపు బ్యాలెన్స్ ఉన్న FD ఖాతాలపై కస్టమర్లకు 3.50శాతం నుంచి 7.35శాతం వరకు భారీ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ బ్యాంకులో FD ఖాతాలను కనీసం 7 రోజుల టెన్యూర్‌తో ఓపెన్ చేయొచ్చు. 55 రోజుల టెన్యూర్ ఎఫ్‌డీ ఖాతాలపై ఎంత వడ్డీని అందిస్తుంది? అలాగే, బ్యాంక్ ఆఫ్ బరోడా FDలో గరిష్టంగా ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

555 రోజుల FDపై వడ్డీ ఎంత? :
బ్యాంక్ ఆఫ్ బరోడా 555 రోజుల FD పథకంపై 6.75 శాతం నుంచి 7.35 శాతం వరకు బంపర్ వడ్డీని అందిస్తోంది. 59 ఏళ్ల వయస్సు వరకు ఉన్న కస్టమర్లందరికీ బ్యాంక్ ఆఫ్ బరోడా 555 రోజుల FD ఖాతాలపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. అంతేకాదు.. ఈ ప్రభుత్వ బ్యాంకు 60 ఏళ్లు, ఆపై ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు 555 రోజుల FD పథకంపై 7.25 శాతం వడ్డీని అందిస్తోంది.

అంతేకాదు.. ఈ ప్రభుత్వ బ్యాంకు 80 ఏళ్లు, ఆపై ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు 555 రోజుల FD పథకంపై అత్యధికంగా 7.35 శాతం రాబడిని అందిస్తోంది. ఈ పథకంలో కస్టమర్లు గరిష్టంగా రూ. 3 కోట్లు పెట్టుబడి పెట్టవచ్చు. సాధారణ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అధిక వడ్డీ రేట్లు పొందవచ్చు.

Read Also : Nokia 300 Charge Feature : నోకియా ఫ్యాన్స్‌కు పండగే.. రివర్స్ ఛార్జింగ్‌తో కొత్త నోకియా 300 ఛార్జ్ ఫీచర్ ఫోన్.. ధర ఎంతంటే?

బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు FD ఖాతాలపై 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తుంది. అంతేకాదు.. ఈ ప్రభుత్వ బ్యాంకు ఎంపిక చేసిన టెన్యూర్లతో FD ఖాతాలపై సీనియర్ సిటిజన్ల కన్నా సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.10 శాతం అధిక వడ్డీని అందిస్తుంది. ఈ ఏడాది జూన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా FD పథకాల వడ్డీ రేట్లను సవరించింది. అన్ని బ్యాంకులు, ఆర్బీఐ నిర్దేశించిన రెపో రేటు ఆధారంగా FD వడ్డీ రేట్లను సర్దుబాటు చేస్తాయి.