Nokia 300 Charge Feature : నోకియా ఫ్యాన్స్‌కు పండగే.. రివర్స్ ఛార్జింగ్‌తో కొత్త నోకియా 300 ఛార్జ్ ఫీచర్ ఫోన్.. ధర ఎంతంటే?
Nokia 300 Charge Feature : నోకియా 300 ఛార్జ్‌కు రైట్ సైడ్ ఫిజికల్ బటన్ కూడా ఉంది. ఈ ఫీచర్ ఫోన్లో 10W రివర్స్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ కూడా ఉంది. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..
Nokia 300 Charge Feature
- ఈ ఫీచర్ ఫోన్లో 2.4 అంగుళాల QVGA డిస్ప్లే
- నోకియా 300 ఛార్జ్‌లో 3,700mAh బ్యాటరీ, 10W రివర్స్ ఛార్జింగ్
- HMD S30+ సాఫ్ట్వేర్ యూనిసోక్ SC6531E చిప్సెట్
Nokia 300 Charge Feature : నోకియా అంటేనే ఫీచర్ ఫోన్లకు రారాజు.. మీరు కూడా నోకియా ఫ్యాన్స్ అయితే మీకో గుడ్ న్యూస్.. ఫీచర్ ఫోన్ మార్కెట్లో కింగ్ మేకర్ హెచ్ఎండీ నుంచి కొత్త నోకియా 300 ఛార్జ్ వచ్చేసింది. ఈ ఫీచర్ ఫోన్ స్ట్రాంగ్ డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. పైన సింగిల్ టార్చ్ ఉంది. సాధారణ ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా లైట్ కాదని, ఒక టార్చ్ మాత్రమేనని హెచ్ఎండీ పేర్కొంది.
నోకియా 300 ఛార్జ్‌లో 3,700mAh బ్యాటరీ ఉంది. స్పెషల్ రివర్స్ ఛార్జింగ్ బటన్ కూడా ఉంది. HMD S30+ సాఫ్ట్వేర్ యూనిసోక్ SC6531E చిప్సెట్తో రన్ అవుతుంది. నోకియా 300 ఛార్జ్‌లో 4MB ర్యామ్, 4MB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫీచర్ ఫోన్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు పెంచుకోవచ్చు.
నోకియా 300 ఛార్జ్ ధర ఎంతంటే? :
ఈ ఫీచర్ ఫోన్ ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. నోకియా 300 ఛార్జ్ ధర PHP 2,190 (దాదాపు రూ. 3,400) ఉంటుంది. ఈ ఫీచర్ ఫోన్ గ్రీన్, సాండ్స్టోన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫీచర్ ఫోన్ లాంచ్ వివరాలు రివీల్ కాలేదు.
Read Also : Redmi 17C 5G Launch : వారెవ్వా.. కొత్త రెడ్మి 17C 5G ఫోన్‌పై ఓ లుక్కేయాల్సిందే.. ఫీచర్లు మామూలుగా లేవు!
నోకియా 300 ఛార్జ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫీచర్ ఫోన్లో 2.4-అంగుళాల QVGA డిస్ప్లే ఉంది. HMD S30+ సాఫ్ట్వేర్ యూనిసోక్ SC6531E చిప్సెట్తో రన్ అవుతుంది. నోకియా 300 ఛార్జ్‌లో 4MB ర్యామ్, 4MB స్టోరేజ్ ఉన్నాయి.
మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. 3,700mAh బ్యాటరీతో రన్ అవుతుంది. సాధారణ ఫీచర్ ఫోన్ బ్యాటరీకి దాదాపు రెట్టింపు ఉంటుంది. ఈ ఫోన్లోని రిమూవబుల్ బ్యాటరీ 40 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ అందిస్తుందని హెచ్ఎండీ పేర్కొంది.
నోకియా 300 ఛార్జ్‌లో రైట్ సైడ్ సింగిల్ ఫిజికల్ బటన్, 10W రివర్స్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ కొలతలు 136.55 x 55 x 14.94mm బరువు, సుమారుగా 138 గ్రాములు ఉంటుంది.
ఇటీవలే HMD నోకియా 235 4జీ, నోకియా 215 4జీ, నోకియా 210 4జీ, నోకియా 200 4జీ సహా ఏఐ ఫీచర్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్లలో వాయిస్ కమాండ్ ద్వారా ఫీచర్లను యాక్సెస్ చేసేందుకు ఏఐ అసిస్టెంట్ బటన్ కూడా ఉంది.
