Covid Treatment Loans : బ్యాంకులు ఆఫర్.. కొవిడ్ చికిత్సకు రూ. 5 లక్షల వరకు రుణాలు..

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా తీవ్ర సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.

Unsecured Loans for Covid Treatment : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా తీవ్ర సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. కరోనా చికిత్సకు భద్రతలేని వ్యక్తిగత రుణాలు అందిస్తామంటున్నాయి. కొవిడ్‌-19 చికిత్సకు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ ఆఫర్ ప్రకటించాయి బ్యాంకులు. హెల్త్‌కేర్ మౌలిక వ‌సతుల ఏర్పాటు కోసం రూ.100 కోట్లతో ఫండ్ కూడా ఏర్పాటు చేశాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ (RBI) మార్గదర్శకాల ప్రకారం.. కోవిడ్ లోన్ స్కీమ్‌లో భాగంగా అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECGLS) కింద ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి బ్యాంకులు రుణాలను కూడా అందిస్తాయి. 7.5 శాతం చొప్పున రూ. 2 కోట్ల వరకు రుణాలు ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అందించనున్నట్లు ఐబిఎ, ఎస్‌బిఐ తెలిపింది.

భ‌ద్ర‌త‌లేని ఈ రుణాల‌పై 8.5 శాతం వ‌డ్డీరేటు వ‌సూలు చేస్తామ‌ని తెలిపాయి. మే నెల ప్రారంభంలో ఆర్బీఐ ప్ర‌క‌టించిన స్కీమ్ కింద చిన్న వ్యాపారుల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రిస్తామ‌ని బ్యాంక‌ర్లు తెలిపారు. బ్యాంక‌ర్లు అర్హులైన క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ MSME రూపేణా ఆఫ‌ర్ చేస్తున్నాయి.

అర్హులు ఎవరైనా.. ఆన్‌లైన్‌లో బ్యాంకులు ఇచ్చిన ఈ ఆఫ‌ర్‌ను ఎల‌క్ట్రానిక్‌గా ఆమోదించ‌డంతోపాటు అప్లికేష‌న్ పంపాల్సి ఉంటుంది. క‌రోనా బాధితులు వారి కుటుంబ స‌భ్యుల చికిత్సకు బ్యాంకులు ప‌ర్స‌న‌ల్ లోన్లు మంజూరు చేస్తాయి. రూ.25 వేల వరకు బ్యాంకులు మంజూరు చేయనున్నాయి. అయితే గ‌రిష్ఠంగా ఐదేళ్లలోపు  లోన్లు చెల్లించాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు