Upcoming TVS Scooters (Image Credit To Original Source)
Upcoming TVS Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? 2026లో సరికొత్త టీవీఎస్ స్కూటర్ కొనేందుకు ఇదే అద్భుతమైన అవకాశం. ప్రత్యేకించి స్టూడెంట్స్ కోసం ఎన్‌టార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. అందులో జూపిటర్ హైబ్రిడ్ ఫ్యామిలీలకు బెస్ట్ ఛాయిస్.
అదేవిధంగా టీవీఎస్ ఎక్స్ఎల్ ఎలక్ట్రిక్ వ్యాపార వినియోగదారులకు సరిగ్గా సరిపోతుంది. అంతేకాదు.. రైడర్లకు ఫ్యూయిల్ బిల్లులపై ఎక్కువ డబ్బులు ఆదా చేస్తాయి. రాబోయే రెండు ఏళ్లలో భారత మార్కెట్లోకి మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త స్కూటర్లు కొనాలని భావిస్తే టీవీఎస్ 2026 పోర్ట్‌ఫోలియోలో మీకు నచ్చిన ఈవీ స్కూటర్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటైన టీవీఎస్ 2026 ఏడాదిలో పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లతో సహా అనేక కొత్త స్కూటర్ మోడళ్లను లాంచ్ చేయనుంది. మంచి మైలేజ్ సౌకర్యవంతమైన రైడింగ్, అదనపు ఫీచర్లతో కొనేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, గృహిణులకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
TVS ఐక్యూబ్ నెక్స్ట్ 2026 :
టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 2026 అతి త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది. ప్రస్తుత ఐక్యూబ్ ధర కన్నా చాలా తక్కువ ధరకే వస్తుంది. భారీ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. దాదాపు 120 కి.మీ. రేంజ్ ఉంటుంది. దీనికి డిజిటల్ డాష్‌బోర్డ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్టు చేస్తుందని అంచనా. స్టైలింగ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. దాదాపు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షల మధ్య అంచనా ధర ఉండవచ్చు.
టీవీఎస్ జూపిటర్ హైబ్రిడ్ :
టీవీఎస్ జూపిటర్ హైబ్రిడ్ వెర్షన్ స్కూటర్.. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారును ఒకేసారి వాడొచ్చు. తద్వారా పన్నెండు రెట్లు మైలేజీని అందిస్తుందని అంచనా. రన్నింగ్ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి.
ఈ స్కూటర్ సిటీలో ప్రయాణించేటప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్, ప్లష్ సీటింగ్ కూడా అందిస్తుంది. మైలేజ్ లీటరుకు 70కి.మీ నుంచి 80 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంచనా ధర దాదాపు రూ. 95వేల నుంచి రూ. 1.10 లక్షల వరకు ఉండవచ్చు.
Read Also : Google Pixel 9a : ఏంటి భయ్యా ఈ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ మరింత ఇంత తక్కువా? అమెజాన్‌లో ఎంత తగ్గిందంటే?
2026 నాటికి యువత కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్ చేయనుంది. నెక్స్ట్ జనరేషన్ ఎన్‌టార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్టీ లుక్, అనేక ఫీచర్లతో వస్తుంది. రేంజ్ వారీగా పరిశీలిస్తే.. 100కి.మీ నుంచి 120 కి.మీ మధ్య దూసుకెళ్లగలదు. బ్లూటూత్, నావిగేషన్, డిజిటల్ మీటర్ ఫీచర్లు స్టాండర్‌గా ఉంటాయి. ధర పరంగా పరిశీలిస్తే.. సుమారు రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.50 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.
Upcoming TVS Scooters : (Image Credit To Original Source)
టీవీఎస్ ఎక్స్ఎల్ ఎలక్ట్రిక్ :
టీవీఎస్ XL ఎలక్ట్రిక్ అత్యంత ఆకర్షణీయమైన స్కూటర్.. చిన్న మొత్తంలో బిజినెస్ చేసేవారికి అద్భుతంగా ఉంటుంది. ప్రతి ట్రిప్‌కు చాలా తక్కువ ఖర్చుతో మెరుగైన లోడ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో రేంజ్ 80 కి.మీ నుంచి 100 కి.మీ. వరకు ఉండవచ్చు. ధర విషయానికి వస్తే దాదాపు రూ. 90వేల నుంచి రూ. 105,000 మధ్య ఉంటుందని అంచనా
టీవీఎస్ క్రియోన్ ఎలక్ట్రిక్ స్కూటర్ :
టీవీఎస్ క్రియోన్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదొకటి. ఫీచర్లు, లాంగ్ రేంజ్, అదిరిపోయే డిజైన్‌ను అత్యంత ఆకర్షణగా ఉండొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు దాదాపు 130 కి.మీ రేంజ్ ఇస్తుంది. ధర విషయానికి వస్తే రూ. 1.40 రూ. 1.60 లక్షల మధ్య ఉంటుందని అంచనా.