Credit Cards: క్రెడిట్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్..

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. అయితే అద్భుతమైన ఆఫర్లు మీ కోసం రెడీగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI) బ్యాంకులు..

Credit Card Offers

Credit Cards: మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. అయితే అద్భుతమైన ఆఫర్లు మీ కోసం రెడీగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI) బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులు వాడేవారికి భారీ ఆఫర్లు ప్రకటించాయి.

ఎంఐ 11 ఎక్స్ 5జీ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2వేల ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. సెప్టెంబర్ నెలాఖరు వరకూ ఈ ఆఫర్ ఉంటుంది. దాంతోపాటు 18 నెలల పాటు నో కాస్ట్ EMI ప్రయోజనం, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది.

ఇకపోతే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫోన్ కొనే వారికి ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పొందొచ్చు. సెప్టెంబర్ 15 వరకు ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్ కమర్షియల్ సైట్ నుంచి కొనుగోలు చేయదలిస్తే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి ఫ్లిప్‌కార్ట్‌లో మరో ఆఫర్ ఉంది. 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.