Best Smartwatches Offer : అమెజాన్‌లో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్ డీల్స్.. ఏ మోడల్ ధర ఎంతంటే?

Best Smartwatches Offer : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? అమెజాన్‌ (Amazon)లో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఏ మోడల్ ధర ఎంతంటే?

Best Smartwatches Offer _ Amazon deals on bluetooth calling smartwatches

Best Smartwatches Offer : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో సరికొత్త స్మార్ట్‌వాచ్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 7న, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని (World Health Day) పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి కోసం ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచే దిశగా కార్యక్రమాలను చేపడుతోంది.

ఈ ఏడాదిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2023 థీమ్ ‘Health For All’, గత 70 ఏళ్లుగా ప్రజారోగ్య విజయాలకు సంబంధించి అనేక అవకాశాలను అందిస్తుంది. ప్రస్తుత రోజుల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే పసిగట్టేందుకు మార్కెట్లో అనేక కొత్త బ్రాండ్లతో స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో బ్లూటూత్-రెడీ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన స్మార్ట్‌వాచ్ బ్రాండ్ కొనుగోలు చేసుకోవచ్చు.

బోట్ వేవ్ లీప్ కాల్ :
ఈ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 1,999గా ఉంది. కనిష్ట విలువ రూ. 15వేలపై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీపై కస్టమర్‌లు రూ. 750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 1.83″ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. 100+ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. SpO2 ట్రాకింగ్‌తో HRతో వస్తుంది.

Best Smartwatches Offer _ Amazon deals on bluetooth calling smartwatches

Read Also : Best Smartphones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఏప్రిల్‌లో రూ.25వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ఫైర్-బోల్ట్ ఎటర్నో :

ఈ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,499గా ఉంది. కస్టమర్‌లు కనిష్ట కొనుగోలు విలువ రూ. 15వేలపై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీపై ఫ్లాట్ రూ. 750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 1.99″ HD డిస్‌ప్లేను కలిగి ఉంది, 120+ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. హార్ట్‌తో పాటు SpO2 ట్రాకింగ్‌తో వస్తుంది. రేటు మానిటరింగ్.. వాయిస్ అసిస్టెంట్ కంట్రోల్ అందిస్తుంది.

Best Smartwatches Offer _ Amazon deals on bluetooth calling smartwatches

నాయిస్ ప్రో 4 GPS స్మార్ట్‌వాచ్ :
ఈ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,999గా ఉంది. 1.85″ TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. హార్ట్ రేట్ మానిటరింగ్‌తో పాటు స్లీపింగ్ ట్రాకింగ్‌తో వస్తుంది.

Best Smartwatches Offer _ Amazon deals on bluetooth calling smartwatches

ఫైర్-బోల్ట్ రింగ్ :
ఫైర్-బోల్ట్ రింగ్ రూ. 3,499 ధరతో వస్తుంది. 1.91″ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. హార్ట్ రేటు మానిటరింగ్‌తో పాటు స్లీప్ ట్రాకింగ్‌తో వస్తుంది. కాల్ ఫంక్షన్‌తో కూడిన స్మార్ట్‌వాచ్ మల్టీ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. వెదర్ ఇండికేషన్, అలారం, రిమోట్ కంట్రోల్ కెమెరా వంటి స్మార్ట్ కంట్రోల్ కలిగి ఉంది.

Best Smartwatches Offer _ Amazon deals on bluetooth calling smartwatches

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3 ఆల్ఫా :
వేరబుల్ ధర రూ. 5,999. 1.69″ HD డిస్‌ప్లేను కలిగి ఉంది, 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. హార్ట్ రేటు మానిటరింగ్‌తో పాటు స్లీప్ ట్రాకింగ్‌తో వస్తుంది. కాల్ ఫంక్షన్‌తో కూడిన స్మార్ట్‌వాచ్ మల్టీ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. అంతేకాదు.. ఈ ఫోన్ కాల్‌లకు ఆన్సర్ ఇస్తుంది. అలాగే డయల్ చేస్తుంది. ఇష్టమైన కాంటాక్టులను స్టోర్ చేస్తుంది. ఇటీవలి హిస్టరీ నుంచి కూడా ఫోన్ కాల్ డయల్ చేస్తుంది. వాచ్‌లో మాత్రమే 80 కన్నా ఎక్కువ ట్రాక్‌లను స్టోర్ చేయగలదు.

Best Smartwatches Offer _ Amazon deals on bluetooth calling smartwatches

Read Also : Maruti Suzuki Fronx Launch : కొత్త కారు కొంటున్నారా? రాబోయే మారుతి SUV కారు గురించి ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి..!