దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్ అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. ఈ యాప్ ను ఇటీవలే సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.
దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్ అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. ఈ యాప్ ను ఇటీవలే సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్ జావేద్ అష్రాఫ్ భీమ్ యాప్‌తో క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను (ఎస్‌జీక్యూఆర్) స్కాన్ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్ యాప్ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని తెలిపారు.
2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్‌లో ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెట్‌వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్స్ (సింగపూర్) సంస్థలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయానికి దేశీ రూపే కార్డులు కూడా సింగపూర్‌లో చెల్లుబాటయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అష్రాఫ్ తెలిపారు.